వైఎస్సార్‌సీపీ అభ్య‌ర్థుల‌పై దాడులు | AP Municipal Elections 2026: Vinukonda incident | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ అభ్య‌ర్థుల‌పై దాడులు

Nov 1 2026 1:45 PM | Updated on Nov 1 2026 1:57 PM

AP Municipal Elections 2026: Vinukonda incident

ఆంధ్ర‌ప్ర‌దేశ్ న‌గ‌ర పాల‌క‌, మున్సిప‌ల్‌, న‌గ‌ర పంచాయ‌తీ ఎన్నిక‌ల పోలింగ్‌లో అధికార కూట‌మి మూక‌లు దాడుల‌కు తెగ‌బ‌డుతున్నాయి. య‌ధేచ్ఛ‌గా దౌర్జ‌న్యాల‌కు దిగుతూ టీడీపీ గూండాలు రిగ్గింగ్‌కు పాల్ప‌డుతున్నారు. అక్ర‌మాల‌కు అడ్డుప‌డిన వైఎస్సార్ సీపీ అభ్య‌ర్థులపై భౌతిక దాడులు చేస్తున్నారు. అధికార పార్టీ అరాచ‌కాల‌ను అడ్డుకోవాల్సిన పోలీసులు ప్రేక్ష‌క‌పాత్ర పోషిస్తుండ‌డంతో ప్ర‌జాస్వామ్యం అప‌హాస్యం పాల‌వుతోంది.

పల్నాడు జిల్లా వినుకొండ 8వ‌ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోలూరు అర్చన మూర్తి, ఆమె భ‌ర్త‌ నరసింహమూర్తిపై పోలింగ్ కేంద్రంలో టీడీపీ గూండాలు దాడి చేశారు. అర్చన మూర్తి దంపతులను పోలింగ్ కేంద్రంలో నుంచి బయటికి లాగి విచక్షణారహితంగా దాడికి పాల్ప‌డ్డారు. త‌మ క‌ళ్లెదుటే దాడి జ‌రుగుతున్నా పోలీసులు ప‌ట్టించుకోలేద‌ని బాధితులు తెలిపారు. తాము ఎటువంటి త‌ప్పు చేయ‌క‌పోయినా ప‌చ్చ పార్టీ నేత‌లు రెచ్చిపోయార‌ని వాపోయారు. 

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఓటు వేయ‌కుండా ఓట‌ర్ల‌ను ప‌చ్చ మూక‌లు అడ్డుకుంటున్నాయి. త‌మ‌ను ఓటు వేయ‌నీయ‌కుండా అడ్డుకున్నార‌ని మాచర్ల ప‌ట్ట‌ణంలోని  6వ వార్డ్ కౌన్సిలర్ అంజలి, రెండో వార్డుకు చెందిన వెంకటరెడ్డి మీడియా ఎదుట త‌మ గోడు వెళ్ల‌బోసుకున్నారు. 

ఇదీ చ‌ద‌వండి: పులివెందులలో కూట‌మి కుట్ర‌లు బ‌ట్ట‌బ‌య‌లు

వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కుమారుడి కిడ్నాప్‌
పల్నాడు జిల్లా సత్తనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గోవిందమ్మ కుమారుడు కిడ్నాప్‌కు గుర‌య్యాడు. తన కుమారుడు పెద్దింటి దీప్ చందు ఓటర్లకు స్లిప్పులు ఇస్తుంటే, నలుగురు కుర్రాళ్ళు మాస్కులు పెట్టుకొని వచ్చి ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని  కిడ్నాప్ చేశారని పోలీసుల‌కు గోవిందమ్మ ఫిర్యాదు చేశారు. అలాగే గ‌త‌రాత్రి పోలీసులు తీసుకెళ్లిన తన భర్త పెద్దింటి వెంకటేశ్వర్లు (చిట్టి) ఆచూకీ చెప్పాల‌ని ఆమె కోరారు. 

వైసీపీ కార్యకర్తపై దాడి
మదనపల్లె పట్టణంలోని మేదర వీధి 29వ వార్డులో వైసీపీ కార్యకర్తపై దాడి జరిగింది. వైసీపీ అభ్యర్థి భానుకు ఓటు వేయాలని ఓటర్లను కోరుతున్న కార్యకర్త మేదర సుబ్బుపై ముసుగులు ధరించి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆరోపించాడు. ఈ దాడిలో గాయపడిన సుబ్బును స్థానికులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement