కొబ్బ‌రికాయ కొట్టి పోలింగ్ ప్రారంభించిన వీర మ‌హిళ‌! | AP Municipal Elections: Jana Sena woman leader starts polling by breaking coconut | Sakshi
Sakshi News home page

కొబ్బ‌రికాయ కొట్టి పోలింగ్ ప్రారంభించిన జ‌న‌సేన మ‌హిళా నేత‌!

Nov 1 2026 11:42 AM | Updated on Nov 1 2026 11:46 AM

AP Municipal Elections: Jana Sena woman leader starts polling by breaking coconut

ఆంధ్ర‌ప్ర‌దేశ్ న‌గ‌ర పాల‌క‌, మున్సిప‌ల్‌, న‌గ‌ర పంచాయ‌తీ ఎన్నిక‌ల పోలింగ్‌లో అధికార కూట‌మి పార్టీల ఆగ‌డాలకు అంతే లేకుండా పోతోంది. అధికారం చేతిలో ఉంద‌న్న అహంకారంతో కూట‌మి పార్టీల నేత‌లు, కార్య‌క‌ర్త‌లు మ‌రింత రెచ్చిపోతున్నారు. ప‌లుచోట్ల టీడీపీ నేత‌లు దాడులు, బెదిరింపుల‌కు దిగ‌డంతో పాటు వైఎస్సార్‌సీపీ ఏజెంట్ల‌ను పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్ల‌కుండా అడ్డ‌గిస్తున్నారు. ఎన్నిక‌లు స్వేచ్ఛ‌గా జ‌ర‌గడానికి స‌హ‌క‌రించాల్సిన‌ పోలీసులు ప్రేక్ష‌క‌పాత్ర పోషిస్తున్నారు. అధికార పార్టీకి అండ‌గా నిలుస్తూ ప్ర‌జాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు. 

వీర మ‌హిళ ఓవరాక్షన్
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జనసేన పార్టీకి చెందిన ఓ నాయకురాలు ఓవరాక్షన్ చేశారు. జనసేన అభ్యర్థి వెంకటరామయ్య భార్య రమాదేవి 23వ వార్డులో పోలింగ్ కేంద్రానికి కొబ్బరికాయ కొట్టి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించారు. దీంతో అధికారుల తీరుపై స్థానికులు, వైఎస్సార్‌సీపీ నేత‌లు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఇలా ఎలా అనుమ‌తిస్తార‌ని గ‌ట్టిగా నిల‌దీయడంతో అధికారులు నీళ్లు న‌మిలారు. ఈ వ్య‌వ‌హారంపై ఉన్న‌త అధికారులకు ఫిర్యాదు చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

చిలకలూరిపేటలో య‌ధేచ్ఛ‌గా రిగ్గింగ్‌
పల్నాడు జిల్లా వ్యాప్తంగా ప‌చ్చ పార్టీ నేత‌ల దౌర్జ‌న్యాలు కొన‌సాగుతున్నాయి. చిలకలూరిపేట 5వ వార్డు దాసరి కాలనీ పోలింగ్ బూత్‌లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను టీడీపీ గూండాలు బలవంతంగా బయటకు నెట్టేసి, రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. 6,13, 14, 16 , 19, 29, 34 , 35 , 36, 37 వార్డుల్లో ప‌చ్చ మూక‌లు పోలింగ్ బూత్‌ల‌ను స్వాధీనం చేసుకుని రిగ్గింగ్ చేశారు. టీడీపీ అరాచ‌కాల‌ను వెలుగులోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నించిన మీడియా ప్రతినిధుల‌పై బెదిరింపుల‌కు దిగారు. ఎమ్మెల్యే ప్ర‌త్తిపాటి పుల్లారావు క‌నుస‌న్న‌ల్లో ఇదంతా జ‌రుగుతోందని వైఎస్సార్‌సీపీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు.

ఓటర్ స్లిప్‌లను చించేసిన‌ టీడీపీ గూండాలు
మాచర్ల మున్సిపాలిటీ 31 వార్డులో టీడీపీ గూండాలు బరితెగించారు. ఓటేయడానికి వెళ్తున్న ఓటర్లను, వైఎస్సార్ సీపీ సానుభూతిపరులను అడ్డుకుని బెదిరింపులకు దిగారు. ఓటర్ స్లిప్‌లను లాక్కుని చించేశారు. మరోసారి పోలింగ్ బూత్ వైపు వస్తే అంతుచూస్తామని ప‌చ్చ పార్టీ గూండాలు దౌర్జ‌న్యం చేశారు.

ఇదీ చ‌ద‌వండి: మున్సిపల్ ఎన్నిక‌ల‌పై మోదుగుల కీలక వ్యాఖ్యలు

సత్తెనపల్లి నపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మండల పరిషత్ కార్యాలయంలోనే పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్లకు పోలీసులు పూర్తి సహకరించారు. మరోవైపు కొన్ని పోలింగ్ బూత్‌లలో కేవలం టీడీపీ ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తూ, వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను మాత్రం అడ్డ‌గించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement