నెల్లూరు : నెల్లూరులో జరుగుతున్న ఎన్నికల్లో రిగ్గింగ్‌కు మంత్రి నారాయణ స్కెచ్ వేశారు. ఇందుకోసం ఆయన నారాయణ కాలేజీ బస్సులను వినియోగిస్తుండగా వైఎస్‌ఎర్సీపీ నేతలు అడ్డుకున్నారు. నెల్లూరు సిటీ డివిజన్లలోలో దొంగ ఓట్లు పోలింగ్‌కు మంత్రి నారాయణ స్కెచ్ వేశారు. దీనిలో భాగంగా 14, 16, 17 తో సహా పలు డివిజన్స్ పోలింగ్ స్టేషన్స్ వద్దకు బస్సులో నారాయణ కళాశాల విద్యార్థులు చేరుకున్నారు. దీంతో బస్సుల ఆపి ఎక్కడికి వెళ్తున్నారని వైసిపీ శ్రేణులు నిలదీయగా, విద్యార్థులు మొహం చాటేశారు. ఇదిలావుండగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ నేతల హడావుడి చేశారు. పోలింగ్ బూతుల వద్ద తిరుగుతూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని వైసీపీ నేతలు తెలిపారు. సైకిల్ గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతల ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని ఎన్నికలు జరిగే ప్రాంతాలకు రావద్దని పోలీసుల ఆదేశాలు ఇచ్చారు. అధికార పార్టీ నేతలను కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు రానివ్వమని పోలీసులు హామీ ఇవ్వడంతో ప్రసన్నకుమార్ రెడ్డి. వెనక్కి తగ్గారు. అయినా కూటమి నేతలు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలా తిరుగుతున్నారంటూ వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి ఒక న్యాయం.. వైసీపీకి మరో న్యాయమా అంటూ వైసీపీ నాయకుల ఆగ్రహం. ఎన్నికల నిబంధనలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు సమానంగా వర్తింపజేయాలని వైసీపీ నేతల డిమాండ్ చేస్తున్నారు.


