సాక్షి, అమరావతి: ఏపీ స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు సర్కార్ అరాచకం సృష్టిస్తోంది. టీడీపీ గూండాలు బీభత్సం సృష్టిస్తున్నారు. పచ్చమూకల అరాచకాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలు, అక్రమాలపై సాక్షికి ఫిర్యాదులు అందుతున్నాయి. సాక్షి వాట్సాప్ నెంబర్‌కు అన్యూహ స్పందన లభిస్తోంది.
భయానక వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నడుస్తోందని.. పోలీసు వ్యవస్థే ముప్పుగా మారితే దేశ భవిష్యత్తేంటి? అంటూ ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ హింసాకాండను పోలీసులు అడ్డుకోకపోవడం సిగ్గుచేటు. పోలీస్ వ్యవస్థ ఏ రాజకీయ పార్టీకి చెందినది కాదంటూ ప్రజలు నిలదీస్తున్నారు.
హింసను అరికట్టడంలో అధికారులు, పోలీసులు విఫలయ్యారు. ఇలా ఉంటే వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోతుంది. హింస ఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రతి హింసాత్మక ఘటనపై నిష్పాక్షిక విచారణ జరగాలి. పోలీసులపై వచ్చిన ఆరోపణలపై స్వతంత్ర సంస్థతో విచారించాలి. బాధితులకు తక్షణ న్యాయం, నష్టపరిహారం అందించాలి. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ప్రతిపౌరుడి ఓటు హక్కును పరిరక్షించాలి’’ అని ప్రజలు అంటున్నారు.
👉స్థానిక ఎన్నికల్లో అరాచకాలు, అక్రమాలపై ఫిర్యాదు చేయండి
మీ ప్రాంతాల్లో పోలింగ్‌ను అడ్డుకున్న వీడియోలు పంపండి.. వీడియోలు పంపాల్సిన వాట్సాప్ నంబర్ 950 5555 065
ఇదీ చదవండి: వైఎస్ జగన్‌పై చంద్రబాబు సర్కార్ కుట్రలు


