మున్సిపల్ ఎన్నిక‌ల‌పై మోదుగుల కీలక వ్యాఖ్యలు | Modugula Venugopala Reddy Comments on Municipal Election | Sakshi
Sakshi News home page

మున్సిపల్ ఎన్నిక‌ల‌పై మోదుగుల కీలక వ్యాఖ్యలు

Nov 1 2026 10:35 AM | Updated on Nov 1 2026 10:47 AM

Modugula Venugopala Reddy Comments on Municipal Election

సాక్షి, గుంటూరు: మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌పై వైఎస్సార్‌సీపీ నేత మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ ముగిసే వరకు  వైఎస్సార్‌సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. పోలింగ్ కేంద్రాల్లోనే ఉండి ప్రతి పరిణామాన్ని పర్యవేక్షించాలని పార్టీ క్యాడర్‌కు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉంటాయని మోదుగుల ఆశాభావం వ్య‌క్తం చేశారు. గుంటూరులో కార్పొరేషన్ 47వ డివిజన్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును ఆయ‌న‌ వినియోగించుకున్నారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని మోదుగుల ఆరోపించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఎన్నికల సంఘం పాటించడం లేదంటూ మండిప‌డ్డారు. పోలింగ్ బూత్‌లలోకి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అనుమతించడం లేదని ఆరోపించారు. టీడీపీ ఏజెంట్లకు మాత్రమే పోలింగ్ కేంద్రాల్లో అనుమతి ఇస్తున్నారంటూ అభ్యంతరం తెలిపారు. ఎన్నికల నిర్వహణ తీరుపై మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఏజెంట్లను అనుమతించడం లేదు: తాడికొండ శ్రీదేవి
కూటమి ప్రభుత్వం ఓడిపోతామనే భయంతోనే పోలింగ్ బూత్‌లలోకి త‌మ‌ పార్టీ ఏజెంట్లను అనుమతించడం లేదని గుంటూరు కార్పొరేషన్ వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి తాడికొండ శ్రీదేవి (Tadikonda Sridevi) ఆరోపించారు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, టీడీపీ ఏజెంట్లకు మాత్రమే పోలింగ్ కేంద్రాల్లో అనుమతిస్తూ వారికి అనుకూలంగా పనిచేస్తున్నారని వాపోయారు. పోలీసులు వెంటనే టీడీపీతో పాటు త‌మ పార్టీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లలోకి అనుమతించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చ‌ద‌వండి: వైఎస్‌ జగన్‌పై చంద్రబాబు సర్కార్‌ కుట్రలు

కూటమి నాయకులు రౌడీయిజం
తెనాలిలో కూటమి నాయకులు రౌడీయిజానికి పాల్ప‌డ్డారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులకు తెగబడ్డారు. కొత్తపేటలోని బాలికల హై స్కూల్ వద్ద వైఎస్సార్‌సీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు నాగమంజరి చౌదరిపై టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి పసుపులేటి త్రిమూర్తులు దాడి చేయటానికి ప్రయత్నించారు. 

59వ డివిజన్ అభ్యర్థిపై టీడీపీ నేత దాడి 
గుంటూరు కార్పొరేషన్‌లో పోలింగ్ కేంద్రాలలో కూటమినేతల అరాచకాలు కొన‌సాగుతున్నాయి. పోటీ చేస్తున్న అభ్యర్థులను బెదిరిస్తూ దాడులకు దిగుతున్నారు ప‌చ్చ పార్టీ నేతలు. 59వ డివిజన్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిపై టీడీపీ నేత దాడికి పాల్ప‌డ్డారు. తన డివిజన్‌లో పోలింగ్‌ పరిశీలించడానికి వెళ్లిన‌ త‌నపై టీడీపీ నేత‌ దాడి చేశారని బాధితుడు వాపోయారు. బయట వ్యక్తులను పిలిపించి రిగ్గింగ్ పాల్పడే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పోలీసులు కూడా అధికార పార్టీకి ఏకపక్షంగా పనిచేస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement