డీఎస్పీ బెదిరింపులు.. తిరగబడ్డ మహిళలు | Pulivendula Polling Tensions, DSP Accused Of Threatening Voters, TDP Faces Rigging Allegations | Sakshi
Sakshi News home page

Pulivendula Polling Tensions: డీఎస్పీ బెదిరింపులు.. తిరగబడ్డ మహిళలు

Nov 1 2026 9:19 AM | Updated on Nov 1 2026 10:16 AM

Pulivendula: Voters Angry Over DSP Comments

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: ఓటర్లపై డీఎస్పీ మురళీ నాయక్‌ బెదిరింపులకు దిగారు. వెళ్లిపోండి.. ఓట్లు వేయొద్దు అంటూ బెదిరించిన డీఎస్పీ.. మీకు ఓటు వేసే హక్కు లేదంటూ ఓటర్లకు డీఎస్పీ వార్నింగ్‌ ఇచ్చారు. ఓటర్లకు రక్షణ కల్పించకుండా పోలీసులు వెనక్కి పంపించారు.

డీఎస్పీ మురళీ‌ అడ్డగోలు వ్యాఖ్యలపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళా ఓటర్లపై బెదిరింపులకు దిగిన డీఎస్పీ మురళీ నాయక్‌.. తప్పుడు సాకు చూపి ఓటర్లను అడ్డుకుంటున్నారు. దీంతో మహిళా ఓటర్లు నిలదీయడంతో డీఎస్పీ వెనుదిరిగారు. మేం కట్టెలు తెచ్చుకోలేదని.. మహిళా కానిస్టేబుళ్లే.. కట్టెలు తీసుకొచ్చారని ఓటర్లు చెబుతున్నారు. మరో వైపు, పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. మహిళా ఓటర్లను లాగిపడేస్తున్నారు.

పులివెందులలో ఇస్లాంపురంలో టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోంది. స్లిప్పులు లాక్కొని ఓటర్లను టీడీపీ గూండాలు వెనక్కి పంపిస్తున్నారు. ఓటు హక్కు కోసం జనం రోడ్కెక్కారు.. దీంతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు ఓటర్లపై రాళ్ల రువ్వారు.

ఇంత అరాచకం ఎన్నడూ చూడ‌లేదు!
పులివెందుల ఐదో వార్డులో తమను ఓటు వేయకుండా మ‌హిళ‌ల‌ను టీడీపీ కార్య‌క‌ర్త‌లు అడ్డుకుంటున్నారు. పోలీసులు పట్టించుకోవడంలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత అరాచకం ఎన్నడూ చూడలేదని, తమకు ఓటు హక్కు కల్పించాలని వారు కోరుతున్నారు. కాగా, ప‌లుచోట్ల టీడీపీ గూండాలు.. ఓట్లు వేయ‌డానికి వెళ్తున్న ప్రజలపై దాడులకు తెగ‌బ‌డ్డారు. 

ఇదీ చదవండి: పులివెందులలో టీడీపీ గూండాల విధ్వంసం 

పులివెందుల చైనారెడ్డి కాలనీలో ఓటు వేసేందుకు వచ్చిన వారిని పోలీసులు తోసేయ‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. కె వెలమవారిపల్లి పోలింగ్ బూత్‌లోకి ఎవరిని ఓటు వేయడానికి రాకుండా టీడీపీ మూకలు అడ్డుకున్నాయి. పులివెందుల మున్సిపాలిటీ 11 వార్డు ఇస్లామ్ పురం పోలింగ్‌ బూత్‌ వద్ద ఓటు వేసేందుకు వెళుతున్న మహిళ స్లిప్పులు టీడీపీ గూండాలు లాక్కుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement