సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో టీడీపీ గూండాలు విధ్వంసం సృష్టిస్తున్నారు. ఓటర్లను పచ్చమూకలు అడ్డుకుంటున్నాయి. చివరకు టీడీపీ అరాచకాలను కవర్ చేస్తున్న జాతీయ మీడియాపై కూడా టీడీపీ రౌడీలు దాడి చేశారు. జాతీయ మీడియా కెమెరాను ధ్వంసం చేశారు. పులివెందుల 11, 12 బూత్‌ల దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై టీడీపీ గూండాలు రాళ్లు విసురుతున్నారు. బూత్‌లకు ఎవరూ రాకుండా పచ్చమూకలు అడ్డుకుంటున్నారు.
పులివెందులలో స్వైర విహారం చేస్తున్న టీడీపీ గూండాలు.. పోలింగ్ బూత్‌లను ఆక్రమిస్తున్నారు. ఓటర్లు రాకుండా రాళ్ల దాడులు చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పచ్చమూకలు ఖూనీ చేస్తున్నారు. టీడీపీ గూండాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. ఓటు వేయకుండా పోలీసులు అడ్డుకోవడంతో పులివెందుల బాయ్స్ జూనియర్ కాలేజీ వద్ద ఓటర్లు నిరసనకు దిగారు. పోలింగ్ బూత్ వద్ద 400 మంది ఓటర్లు బైఠాయించారు.
తమ ఓట్లు టీడీపీ నేతలే వేస్తున్నారని ఓటర్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఓటర్లపై డీఎస్పీ మురళీ నాయక్ బెదిరింపులకు దిగారు. వెళ్లిపోండి.. ఓట్లు వేయొద్దు అంటూ బెదిరించిన డీఎస్పీ.. మీకు ఓటు వేసే హక్కు లేదంటూ ఓటర్లకు డీఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. ఓటర్లకు రక్షణ కల్పించకుండా పోలీసులు వెనక్కి పంపుతున్నారు.

ఇదీ చదవండి: వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పేరు పక్కన హస్తం గుర్తు


