‘వైఎస్సార్‌సీపీ వీరోచిత పోరాటం చేస్తోంది’ | YSRCP Leaders Raise Serious Concerns Over Municipal Election Process In Andhra Pradesh, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

‘వైఎస్సార్‌సీపీ వీరోచిత పోరాటం చేస్తోంది’

Nov 1 2026 10:44 AM | Updated on Nov 1 2026 11:38 AM

YSRCP Leaders Serious Comments On Election Process

సాక్షి, విశాఖ/ తాడిపత్రి: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓటర్లను టీడీపీ గూండాలు, పోలీసులు అడ్డుకుంటున్నారని, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను నిర్బంధిస్తున్నారని పార్టీ నాయకులు ఆరోపించారు. అనంతపురంలో మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, విశాఖలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.

అనంతపురంలో అనంత వెంకటరామిరెడ్డి వ్యాఖ్యలు..

  • ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.

  • ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.

  • ప్రజాస్వామ్యానికి ఓటే ఆయుధం. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి.

  • అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లో అరాచకవాదులకు ఓటుతో బుద్ధి చెప్పాలి.

  • దౌర్జన్యాలు, రౌడీయిజానికి ఓటుతోనే సమాధానం చెప్పాలి.

  • డబుల్ రిజిస్ట్రేషన్లకు కూడా ఓటుతో బుద్ధి చెప్పాలి.


హౌస్ అరెస్ట్ చేయడంపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం

  • స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనకుండా తనను హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు.

  • గత పది రోజులుగా తనను ఎలా హౌస్ అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు.

  • రాష్ట్రంలో రెడ్ బుక్ అరాచకాలు తీవ్రమయ్యాయని విమర్శించారు.

  • ప్రజల ఓటు హక్కును టీడీపీ కూటమి ప్రభుత్వం హరిస్తోందని ఆరోపించారు.

  • తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, ఆయన తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలు సృష్టిస్తున్నారని విమర్శించారు.

  • వైఎస్ జగన్ చలవ వల్లే తాను మున్సిపల్ చైర్మన్ అయ్యానని స్వయంగా జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారని గుర్తుచేశారు.

  • నిజంగా అభివృద్ధి చేసి ఉంటే మున్సిపల్ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేవని వ్యాఖ్యానించారు.

  • తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను నిర్బంధించారని ఆరోపించారు.

  • జేసీ వర్గీయులు యథేచ్ఛగా రిగ్గింగ్, సైక్లింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు.

  • పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.


విశాఖలో గుడివాడ అమర్నాథ్ విమర్శలు..

  • మింది హైస్కూల్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. అనంతరం మీడియాతో మాట్లాడారు.

  • ఓటు హక్కు పౌరుడి చేతిలో ఆయుధం వంటిదని, ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు.

  • రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న తీరు బాధ కలిగిస్తోందన్నారు.

  • ఓటు వేసేందుకు వచ్చే వారిని అడ్డుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు.

  • కదనరంగంలో వీరమరణం పొందుతాం తప్ప వెనకడుగు వేసేది లేదన్నారు.

  • వైఎస్సార్‌సీపీ వీరోచిత పోరాటం చేసిందని పేర్కొన్నారు.

  • కూటమి ప్రభుత్వ అభద్రతాభావం బయటపడుతోందని విమర్శించారు.

  • ఓటు వేసేందుకు వచ్చే వారిని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

  • పులివెందులనే లక్ష్యంగా చేసుకోవాలని చూస్తున్నారని అన్నారు.

  • ఇలాగే జరిగితే ఎన్నికలు ఎందుకు? చంద్రబాబు తన మనుషులను నామినేట్ చేస్తే సరిపోయేదని వ్యాఖ్యానించారు.

  • ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు.

  • ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వారి తరఫున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

మాచర్లలో పిన్నెల్లి ఆరోపణలు

  • మాచర్ల మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • మొత్తం 12 మంది అభ్యర్థులతో పాటు నేతలను పోలీసులు స్టేషన్‌లో నిర్బంధించారని ఆరోపించారు.

  • నాలుగు గంటలుగా పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారని తెలిపారు.

  • వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు లేకుండా చేసి అభ్యర్థులను బూత్‌లకు రాకుండా చేస్తున్నారని విమర్శించారు.

  • బూత్ క్యాప్చరింగ్, భారీ రిగ్గింగ్ కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు.

  • పోలింగ్ ప్రారంభమైనా బూత్‌ల పరిశీలనకు కూడా అభ్యర్థులను వెళ్లనివ్వడం లేదని, ఎన్నికల సంఘం ఏం చేస్తోందని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement