సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు సర్కార్ ఖూనీ చేస్తుందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాలను టీడీపీ గూండాలు ఆక్రమించారని.. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు వెళ్లకుండా అడ్డుకుంటున్నారంటూ మండిపడ్డారు. పులివెందుల 80 బూత్‌ల్లో 70 చోట్ల వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అడ్డుకున్నారు.
యథేచ్ఛగా దొంగ ఓట్లు వేస్తున్నారు.. ఇది ప్రజాస్వామ్యమేనా? అంటూ ప్రశ్నించిన వైఎస్ జగన్.. అధికార పార్టీకి పోలీసులే సహకరిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉదయం 4 గంటల నుంచే టీడీపీ వాళ్లు పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకున్నారు. ఈ ఎన్నికలు రద్దు చేసి రీ పోలింగ్ ఎందుకు పెట్టకూడదు?. వచ్చిన ఓటర్లను పోలీసులే వెనక్కి పంపుతున్నారు’’ అంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.
‘‘యథేచ్ఛగా దొంగ ఓట్లు వేస్తున్నారు. ఎస్పీలు, కలెక్టర్లకు ఫోన్ చేసినా స్పందన లేదు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు లేకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు?. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ప్రమీలమ్మపై దాడి చేశారు. ఓటర్ల స్లిప్పులను బలవంతంగా లాక్కొని వెనక్కి పంపారు. మీ ఓటు పడిపోయిందంటూ ఓటర్లను వెనక్కి పంపేశారు. కౌన్సిలర్ అభ్యర్థులను బలవంతంగా అరెస్టులు చేశారు.
..ఎన్నికల అక్రమాలను కవర్ చేస్తున్న ఇండియా టుడే, ఎన్‌టీవీ కెమెరాలు ధ్వంసం చేశారు. మీడియా రిపోర్టర్లపైనా దాడులు చేశారు. పులివెందుల, జమ్మలమడుగు, చిత్తూరు, మాచర్ల, తాడిపత్రి మదనపల్లిలో ఓట్లు వేయనివ్వడంలేదు. సీఎంగా కొనసాగేందుకు చంద్రబాబు ఒక్కరోజు కూడా అర్హుడు కాదు’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు.
..కళ్లెదుటే గూండాలు కనిపిస్తున్నా పోలీసుల చర్యల్లేవు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఎస్‌ఈసీ పాటించడం లేదు. బూత్‌ల్లో వీడియో రికార్డింగ్, సీసీ కెమెరాలు లేవు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు లేకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు. ఏజెంట్లు లేకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తాం. రీపోలింగ్ జరపాలని ఆర్వోను కోరతాం’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: వైఎస్ జగన్‌పై చంద్రబాబు సర్కార్ కుట్రలు


