హెలికాప్టర్‌ ల్యాండ్‌ కాకూడదని ‘కూటమి’ కుట్ర | Ys Jagan Reaction To Helicopter Emergency Landing In Pulivendula | Sakshi
Sakshi News home page

హెలికాప్టర్‌ ల్యాండ్‌ కాకూడదని ‘కూటమి’ కుట్ర

Nov 1 2026 12:21 PM | Updated on Nov 1 2026 12:29 PM

Ys Jagan Reaction To Helicopter Emergency Landing In Pulivendula

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: పులివెందులలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు చంద్రబాబు సర్కార్‌ ఆటంకాలు సృష్టించిన సంగతి తెలిసిందే. కూటమి సర్కార్‌ కుట్రలపై స్పందించిన వైఎస్‌ జగన్‌.. పులివెందులలో హెలికాప్టర్‌ ల్యాండ్‌ కాకూడదని కుట్ర పన్నారని.. తప్పనిసరి పరిస్థితుల్లో హెలికాప్టర్‌ ల్యాండ్‌ అయ్యిందన్నారు. ప్రజలను రక్షించాల్సినవారే భక్షిస్తే ఎలా?’’ అంటూ వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

‘‘కళ్లెదుటే గూండాలు కనిపిస్తున్నా పోలీసుల చర్యల్లేవు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఎస్‌ఈసీ పాటించడం లేదు. బూత్‌ల్లో వీడియో రికార్డింగ్‌, సీసీ కెమెరాలు లేవు. వైఎస్సార్‌సీపీ  ఏజెంట్లు లేకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు. ఏజెంట్లు లేకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తాం. రీ పోలింగ్‌ జరపాలని ఆర్వోను కోరతాం.

..యథేచ్ఛగా దొంగ ఓట్లు వేస్తున్నారు. ఎస్పీలు, కలెక్టర్లకు ఫోన్‌ చేసినా స్పందన లేదు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు లేకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు?. వచ్చిన ఓటర్లను పోలీసులే వెనక్కి పంపుతున్నారు. ఇది ప్రజాస్వామ్యమేనా?. పులివెందులలో జరుగుతున్న ఘటనలే ఇందుకు నిదర్శనం’’ అంటూ వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: వైఎస్‌ జగన్‌పై చంద్రబాబు సర్కార్‌ కుట్రలు

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement