మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హౌస్ అరెస్ట్ | YSRCP Ex MLA Silpa Ravi Chandra Kishore Reddy House Arrest During Polling, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హౌస్ అరెస్ట్

Nov 1 2026 3:42 PM | Updated on Nov 1 2026 4:44 PM

Silpa Ravi Chandra Kishore Reddy house arrest

నంద్యాల జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస‍్థల ఎన్నికల పోలింగ్‌ వేళ టీడీపీ కేట్రలు కొనసాగుతున్నాయి. నంద్యాలలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి అడుగడుగునా పోలీసులు అడ్డంకులు కల్పించారు. నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటున్న కూడా పోలీసులు వేధింపులకు గురిచేశారు. అడుగడుగునా అడ్డంకులు సృష్టించి పోలింగ్ సరళిని టీడీపీకి అనుకూలంగా మరల్చడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

మంత్రి ఫరూక్, ఆయన కుమారులు ఫిరోజ్, ఫయాజ్, ఎంపీ శబరికి లేని నిబంధనలు తనకే వర్తిస్తాయా అంటూ పోలీసులను ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి ప్రశ్నించారు. నోటీసులు ఇచ్చి ఆయనను పోలింగ్ బూత్‌లకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. 2024లోని కేసును సాకుగా చూపి మాజీ ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకున్న పోలీసులు

శ్రీశైలం, పక్క నియోజకవర్గల నుంచి భారీగా టీడీపి మూకలు వారి అనుచరులతో నంద్యాలలో ఉన్నారు. మంత్రి ఫరూక్, ఆయన కుమారులపై ఉన్న కేసులు వారికి వర్తించవా అని ప్రశ్నించారు. చివరకు నంద్యాల శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement