ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంద్రాగస్టు నాడు ఎర్రకోట నుంచి చేసిన స్వాతంత్ర్య దినోత్సవ చేసిన ప్రసంగంలో 'దిమాగీ నక్సలైట్లు' అనే మాట వాడారు. మావోయిస్టు భావజాల మద్దతుదారులను ఆయన ఈ విధంగా వర్ణించారు. అంతేకాదు దిమాగీ నక్సలైట్లు అన్ని వ్యవస్థల్లోనూ పాతుకుపోయారని.. దేశంలో హింస, అరాచకాలను రెచ్చగొట్టే అవకాశాల కోసం కాపుకాచుకుని కూర్చుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు ఒంటికాలిపై లేచాయి. దిమాగీ నక్సలైట్ల పేరుతో అసమ్మతిని అణచడానికి మోదీ సర్కారు కుటిలయత్నం చేస్తోందని మండిపడ్డాయి.
తాజాగా కర్ణాటక బీజేపీ విభాగం ఎక్స్‌లో పెట్టిన పోస్ట్‌పై వివాదం రాజుకుంది. దిమాగీ నక్సల్స్‌ను ఉపేక్షించబోమంటూ పెట్టిన పోస్ట్‌కు జత చేసిన వీడియోపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ''నెమ్మదించే సమస్యే లేదు.. సర్వశక్తులు ఒడ్డి దిమాగీ నక్సల్స్‌పై పోరాటం చేస్తామంటూ'' కర్ణాటక బీజేపీ అధికారిక ఎక్స్ పేజీలో ఈ నెల 27న ఒక పోస్ట్ పెట్టింది. దీనికి యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాలోని వీడియో క్లిప్పింగ్ జతచేసింది. కొండపై నుంచి హీరో యశ్.. విలన్ సంజయ్‌దత్ గ్యాంగ్‌పై తుపాకులతో కాల్పులు జరుతున్న సన్నివేశంలోని క్లిప్ ఇది. ఇందులో ప్రతినాయకుల బృందాన్ని దిమాగీ నక్సల్స్‌గా పేర్కొంది.
మీర్జాపూర్.. కేజీఎఫ్
ఛత్తీస్‌గఢ్ బీజేపీ విభాగం ఎక్స్‌లో పెట్టిన పోస్ట్‌కు స్పందనగా కర్ణాటక కమలం పార్టీ ఈ పోస్ట్ పెట్టింది. 'దిమాగీ నక్సల్‌గా ఉండడం కంటే దేశ ప్రగతిలో పాలుపంచుకోవాలని' పేర్కొంటూ.. మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లోని వీడియో క్లిప్‌ను జతచేసింది ఛత్తీస్‌గఢ్ కాషాయదళం. దీనికి ప్రతిస్పందనగా కర్ణాటక బీజేపీ, 'కేజీఎఫ్ 2' వీడియో క్లిప్ పెట్టింది. దీనిపై ప్రజాస్వామికవాదులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తన మాట వినని వారిని ప్రభుత్వం తుపాకులతో భయపెడుతోందంటూ దుయ్యబడుతున్నారు.
ఇదీ చదవండి: 'ఎదురు చెప్పను.. ప్రెస్‌మీట్ పెట్టను'
మిమ్మల్ని ప్రశ్నించే వారిని నిర్మూలిస్తారా?
భయం, అహంకారంతో ప్రభుత్వం నిరంకుశత్వానికి పాల్పడుతోందని ధ్వజమెత్తున్నారు. యువత మాట వినాల్సిన ప్రభుత్వం వారిని తూటాలతో బెదిరిస్తోందనిచ మండిపడుతున్నారు. అధికార పార్టీకి చెందిన అధికారిక హ్యాండిల్‌లో బెదిరింపులు, బలప్రయోగ హెచ్చరికలు చేయడాన్ని ఖండించారు. బీజేపీ రాష్ట్ర ఐటీ సెల్‌లు దాదాపు ప్రతి పోస్టులోనూ ఒకే రకమైన బెదిరింపు, అహంకారం, ధిక్కారంతో హింసను, ద్వేషాన్ని, గూండాగిరిని ఎందుకు ప్రదర్శిస్తూనే ఉన్నాయని ప్రశ్నించారు. బీజేపీ ఇంతలా దిగజారుతుందని ఎప్పుడూ అనుకోలేదని పేర్కొన్నారు. 'మీ విధానాలు నచ్చని వారిని, మిమ్మల్ని ప్రశ్నించే వారిని నిర్మూలించాలని భావించడం సరికాదని' అన్నారు.
No slowing down - taking on "Dimaagi Naxals" with full force! https://t.co/cYhIZmKJ6E pic.twitter.com/iqANzyrBRT
— BJP Karnataka (@BJP4Karnataka) August 27, 2026


