‘కరువు-చంద్రబాబు కవల పిల్లలు’ | YSRCP Spokesperson Putta Shiva Shankar Slams Chandrababu | Sakshi
Sakshi News home page

‘కరువు-చంద్రబాబు కవల పిల్లలు’

Aug 29 2026 3:56 PM | Updated on Aug 29 2026 4:40 PM

YSRCP Spokesperson Putta Shiva Shankar Slams Chandrababu

తాడేపల్లి :  చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అన్ని వర్గాలకు నష్టమేనని, ఫస్ట్‌ ఎఫెక్ట్‌ రైతుల మీద పడుతుందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌ విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉంటే రైతులు గిట్టుబాటు ధరలేక రోడ్డున పడటం కామనైపోయిందని స్పష్టం చేశారు. కరువు-చంద్రబాబు కవల పిల్లల మాదిరే ఉంటాయనేది తాజా పరిస్థితులు మరోసారి అద్దం పడుతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటిని తీరును పుత్తా శివ శంకర్‌ వివరించారు. 

‘పంచదార రూ.40 నుండి రూ.75 కి పెరిగింది. బియ్యం రూ.48 నుండి రూ 65లకు పెరిగింది. ఉల్లిపాయలు రూ.18ల నుండి రూ .70లకు పెరిగింది. నూనెల ధరలు రూ.140 ల నుండి రూ. 215 పెరిగాయి. ఇక కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. సామాన్యుడు బతికే పరిస్థితి లేకుండా పోయింది. ప్రతి క్వార్టర్ లిక్కర్ బాటిల్ మీద రూ.40 ల వరకు పెంచారు. కరెంటు ఛార్జీల పరిస్థితీ దారుణంగా ఉంది. పెరిగిన ధరలపై చంద్రబాబు కనీసం ఒక్క సమీక్ష కూడా ఎందుకు నిర్వహించటం లేదు?,’ అని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

రైతులను ముంచడమే చంద్రబాబు ఉద్దేశమా?: కాకాణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement