విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యలో ఫీజులు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 10 శాతం ఫీజులు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఫీజులు పెరిగాయి. ఎంబీబీఎస్ ఏ కేటగిరీ ఫీజు రూ.18,150కి పెరిగింది.
ఫీజులు ఇలా..
బీ కేటగిరీ ఫీజు రూ.14,52,000 కి పెంపు
సీ కేటగిరీ రూ.43.56 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు
బీడీఎస్ ఏ కేటగిరీ ఫీజు రూ.15,730 కి పెంపు
బీ కేటగిరీ రూ.4,84,000 కి పెంపు
సీ కేటగిరీ రూ.14,52,000కి పెంచుతూ ఉత్తర్వులు జారీ





