ప్రణయ్‌రెడ్డి హౌజ్‌ అరెస్ట్‌.. ఉరవకొండలో ఉద్రిక్తత | High Tensions In Uravakonda Amid Pranay Reddy House Arrest, More Details Inside | Sakshi
Sakshi News home page

ప్రణయ్‌రెడ్డి హౌజ్‌ అరెస్ట్‌.. ఉరవకొండలో ఉద్రిక్తత

Published Sat, Jul 6 2024 8:39 AM | Last Updated on Sat, Jul 6 2024 12:26 PM

High Tensions In Uravakonda Amid Pranay Reddy House Arrest

అనంతపురం, సాక్షి: ప్రభుత్వ ఆదేశాలతో అనంత పోలీసులు అత్యుత్సాహానికి దిగారు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తనయుడు ప్రణయ్ రెడ్డిని శనివారం ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

వైఎస్సార్‌ జయంతి ఏర్పాట్ల పర్యవేక్షణతో పాటు టీడీపీ దాడుల్లో గాయపడిన వాళ్లను పరామర్శించేందుకు ప్రణయ్‌రెడ్డి పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఉరవకొండ వెళ్లకుండా ఆయన్ని పోలీసులు గృహ దిగ్భందం చేశారు. గత రాత్రి నుంచే ఆయన ఇంటి ముందు మోహరించారు. 

కారణం ఏంటని అడిగినా పోలీసులు సమాధానం చెప్పకపోవడం గమనార్హం. మరోవైపు తన తనయుడి విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును విశ్వేశ్వరెడ్డి తీవ్రంగా ఖండించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement