తెలంగాణకు రేవంత్‌ అన్యాయం: హరీష్‌రావు | Harish Rao's Remarks At The Meeting Held At Telangana Bhavan In Hyderabad | Sakshi
Sakshi News home page

తెలంగాణకు రేవంత్‌ అన్యాయం: హరీష్‌రావు

Jun 27 2026 2:14 PM | Updated on Jun 27 2026 4:06 PM

Harish Rao's Remarks At The Meeting Held At Telangana Bhavan In Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: కర్ణాటకలో జరిగిన మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సీక్రెట్ సమావేశమేంటో బయటపెట్టాలంటూ మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చారిత్రక ఒప్పందం అంటున్న రేవంత్‌.. ఆ ఒప్పందం  ఏమిటో స్పష్టత ఇవ్వాలన్నారు.

‘‘కోల్డ్ స్టోరేజ్‌లోకి వెళ్లిన గుండ్రేవుల ప్రాజెక్ట్ నేడు తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రుల సమావేశంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, అధికారులను బయట కూర్చోబెట్టారు. నీటి వాటాల పంపకంలో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఇకపై ఊరుకునేదిలేదు

..కర్ణాటక ప్రతిపాదించిన నవేలితో పాటు, ఆంధ్రప్రదేశ్‌లోని గుండ్రేవుల ప్రాజెక్ట్ (20 టీఎంసీలు)ల వల్ల దిగువన ఉన్న తెలంగాణకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. రేవంత్‌రెడ్డి తన అవగాహన రాహిత్యంతో దీర్ఘకాలిక రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయడంతో పాటు, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు’’ అంటూ హరీష్‌రావు మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement