
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సిద్ధాంతమే జనసేన సిద్ధాంతమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే, విశాఖ అభివృద్ధిపై పవన్ ఉన్న ఆలోచన ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
కాగా, మంత్రి అమర్నాథ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్యాకేజీలకు కక్కుర్తిపడే వ్యక్తి పవన్. ఆయన(పవన్ కల్యాణ్)కు విశాఖ ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చిందా?. మీ దత్తతండ్రి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మీకు ఏరోజు సమస్యలు కనిపించలేదు అంటూ సెటైరికల్ పంచ్ విసిరారు. ఉత్తరాంధ్రకు ఏం అన్యాయం జరిగిందని పర్యటనకు వస్తున్నారని ప్రశ్నించారు. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటిస్తే ఎందకు స్వాగతించలేదన్నారు. గాజువాకలో ఓడిపోయారని యాత్ర చేస్తున్నారా? అని ఎద్దేవా చేశారు.
ఇక, వారాహి వెబ్ సిరీస్-3 రేపు విశాఖలో ప్రారంభమవుతోందని సెటైర్లు వేశారు. ఇదే సమయంలో విశాఖ వేదికగా 175 స్థానాల్లో పవన్ పోటీ చేస్తామని చెప్పగలరా? అని ప్రశ్నించారు. కనీసం ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన నేతల పేర్లు పవన్‌కు తెలుసా?. విశాఖ జిల్లా జనసేన అధ్యక్షుడు ఎవరో పవన్ చెప్పగలరా? అని ప్రశ్నించారు. విశాఖ వచ్చేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడానికేనా?. 25 సీట్లలో పోటీ చేసి సీఎం అవుతారా?. సీఎం జగన్ సామర్థ్యం తెలిసు కాబట్టే 151 సీట్లతో ప్రజలు గెలిపించారు. చంద్రబాబు విజయనగరం పర్యటనలో 300 మంది కూడా లేరు. ఇటువంటి సూపర్ స్టార్‌ను ఎవరు చంపుతారు.
మరోవైపు.. పవన్‌కు మంత్రి అమర్నాథ్ కౌంటరిచ్చారు.
- 20 ఏళ్ల క్రితం అత్తారింటికి దారేది అంటే విశాఖ..
- 15 ఏళ్ల క్రితం అత్తారింటికి దారేది అంటే ముంబై..
- 10 ఏళ్ల క్రితం అత్తారింటికి దారేది అంటే రష్యా.. కాపు ఆడపడుచుకు 20 ఏళ్ల క్రితమే పవన్ అన్యాయం చేశారని తెలిపారు.
ఇదే సమయంలో పవన్‌కు పది పశ్నలు సంధించారు మంత్రి అమర్నాథ్..
1. విశాఖను పరిపాలన రాజధానిగా వ్యతిరేకించిన పవన్‌కు ఉత్తరాంధ్రలో పర్యటించే అర్హత ఉందా?
2. ఉత్తరాంధ్ర మీద పవన్‌కు సొంత ఎజెండా ఉందా?
3. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎందుకు అడ్డుకోలేదు?
4. చంద్రబాబు పాలనలో 40 గుళ్ళు కులదొస్తే ఎందుకు నోరు మెదపలేదు?
5. కమీషన్ కోసం కక్కుర్తిపడి చంద్రబాబు పోలవరాన్ని నాశనం చేస్తే ఎందుకు ప్రశ్నించలేదు.
6. ప్రత్యక హోదాపై ఎందుకు మాట్లాడం లేదు?.
7. ఉద్దనం కిడ్నీ సమస్యను పరిష్కరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎందుకు అభినందించలేకపోతున్నావు?
8. వాలంటీర్ వ్యవస్థను కించపరిచిన పవన్ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది.
9. పోలీసు కానిస్టేబుల్ కుమారుడిని అని చెప్పుకొనే పవన్ 40 మంది పోలీసులకు గాయలైతే ఎందుకు స్పందించలేదు?.
10. స్టీల్ ప్లాంట్‌పై కార్మికులకు ఒక క్లారిటీ ఇవ్వాలి.
ఇది కూడా చదవండి: రామోజీకి కోర్టుల్లో చాలా పలుకుబడి ఉంది: మాజీ ఎంపీ ఉండవల్లి