కంటైనర్‌ టెర్మినల్‌ మూసేయలేదు | Former Minister Kakani Govardhan Reddy comments on somireddy | Sakshi
Sakshi News home page

కంటైనర్‌ టెర్మినల్‌ మూసేయలేదు

Jun 30 2024 3:35 AM | Updated on Jun 30 2024 3:35 AM

Former Minister Kakani Govardhan Reddy comments on somireddy

అదానీని సోమిరెడ్డి కలిసేది కలెక్షన్ల కోసమే 

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి 

నెల్లూరు (పొగతోట): కృష్ణపట్నం పోర్టులో కంటైనర్‌ టెర్మినల్‌ మూసివేయలేదని యాజమాన్యం చెబుతున్నా.. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హడావుడి చేయడం సిగ్గు చేటని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి దుయ్యబట్టారు. శనివారం నెల్లూరులోని జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో కాకాణి మాట్లాడుతూ.. కంటైనర్‌ టెర్మినల్‌ తరలిపోయిందని, అక్రమ టోల్‌గేట్లు పెట్టి సంపాదించుకుంటున్నారని విమర్శిస్తున్న సోమిరెడ్డి వాటిని రుజువు చేయాలని సవాల్‌ విసిరారారు. 

ఈ విషయంలో దమ్ముంటే విచారణ జరిపించాలని చాలెంజ్‌ చేశారు. అదానీని కలుస్తానని సోమిరెడ్డి చెప్పడం కలెక్షన్ల కోసమే అని ఆరోపించారు. సోమిరెడ్డికి కళ్లు కనిపించడం లేదని, కళ్లల్లో చుక్కల మందు వేసుకుని చూడాలని హితవు పలికారు. ‘ప్రస్తుతం సోమిరెడ్డి అధికారంలో ఉన్నారు. కంటైనర్‌ టెర్మినల్‌ విషయంలో ధైర్యం ఉంటే టోల్‌గేట్‌ ఎక్కడ పెట్టారో.. అక్రమంగా ఎవరు సంపాదిస్తున్నారో నిరూపించాలని..  లేదంటే అన్నీ మూసుకుని కూర్చోవాలి’ అని హితవు పలికారు. అ«ధికారంలోకి రాగానే ఎమ్మెల్యే సోమిరెడ్డి అవినీతిపైనే దృష్టి కేంద్రీకరించారని విమర్శించారు. కృష్ణపట్నం పోర్టులో యాష్‌ పాండ్‌తోపాటు లే అవుట్ల యజమానుల నుంచి వసూళ్లు మొదలుపెట్టారని దుయ్యబట్టారు. అభివృద్ధి కోసం కాకుండా అవినీతి సంపాదన కోసం సోమిరెడ్డి ప్రణాళికలు సిద్ధం చెప్పారు.

‘మీరు శిలఫలాకాలు, విగ్రహాలు, ఆస్తులను కూల్చామని విర్రవీగుతున్నారు. మీరు ఎక్కడ ఏవేవి కూల్చారో వాటిని మీతోనే వాటిని పునరి్నరి్మంచే రోజు వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని స్పష్టం చేశారు. జిల్లాలోని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల కోసం తాము వాచ్‌మెన్‌ డ్యూటీ చేస్తామని కాకాణి అన్నారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం జరిగినా వారికి అండగా ఉండి అన్ని విధాలా అదుకుంటామని భరోసా ఇచ్చారు. జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా వచ్చి కార్యకర్తల వెన్నంటే ఉంటామని, అండగా నిలుస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement