- సర్వేపల్లిలో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేతలు
- టీడీపీ నేతలు వలస బాట పట్టడంతో తల పట్టుకుంటున్న సోమిరెడ్డి
- స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే నాటికి సర్వేపల్లిలో ఖాళీ అయ్యే స్థితికి టీడీపీ
- కాకాణి నాయకత్వం మీద నమ్మకంతో టీడీపీని వీడుతున్న నాయకులు
నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఇప్పటివరకూ టీడీపీ అంటిపెట్టుకుని ఉన్న 30 కుటుంబాలకు చెందిన నేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నమ్మకంతో పాటు స్థానిక నాయకుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి మీద నమ్మకంతో టీడీపీని వీడారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే నాటికి సర్వేపల్లిలో టీడీపీ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీ నేతలు వలస బాట పట్టడంతో ఎమ్మెల్యే సోమిరెడ్డి తలలు పట్టుకుంటున్నారు.

మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి నివాసంలో తోటపల్లి గూడూరు మండలం, వెంకన్న పాలెం గ్రామానికి చెందిన 30 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్ఆర్‌సీపీలో చేరాయి. వీరికి వైఎస్సార్‌సీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు కాకాణి. దాంతో సర్వేపల్లిలో టీడీపీ క్రమేపీ బలహీనపడుతోంది.

వైఎస్సార్‌సీపీలో చేరిన వారంతా వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎం చేయడమే లక్ష్యంగా పని చేస్తామని అంటున్నారు.
ఇదీ చదవండి: రెండేళ్లలో వచ్చేది మన ప్రభుత్వమే: బొత్స


