కాంగ్రెస్‌లో చేరిన సీనియర్‌ నేత.. బీజేపీకి బిగ్‌ షాక్‌

Former Minister Chandrasekhar Joined In Congress - Sakshi

సాక్షి, వికారాబాద్‌: తెలంగాణలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. కొంతకాలం అసంతృప్తితో ఉన్న సీనియర్‌ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్‌.. కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి.. కాంగ్రెస్‌లోకి చంద్రశేఖర్‌ను ఆహ్వానించారు. పార్టీ కండువా కప్పి పార్టీ సభ్యత్వం అందించారు. 

ఈ సందర్బంగా రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ కుటుంబ పాలనకు ముగింపు పలకాలి. తెలంగాణకు కేసీఆర్‌ చీడపీడ. సీనియర్‌ నేత చంద్రశేఖర్‌ను కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించాం. కేసీఆర్‌ లక్ష కోట్ల విలువైన పదివేల ఎకరాల భూమి కాజేశారు. కేసీఆర్‌ అవినీతిపై బీజేపీ చర్యలు తీసుకుంటుదని ఆశించారు.. కానీ, అలా జరగకపోవడంతో బీజేపీకి రాజీనామా చేశారు. కేసీఆర్‌ వ్యతిరేక శక్తుల పునరేకీకరణలో భాగంగా చంద్రశేఖర్‌ కాంగ్రెస్‌లో చేరడానికి అంగీకరించారు. ఈనెల 18న కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే తెలంగాణలో పర్యటించనున్నారు. 

తెలంగాణలో దళితులకు ఇచ్చిన అసైన్డ్‌ భూములను ప్రభుత్వం లాక్కుని రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ చేస్తోంది. దళితులకు, గిరిజనులకు ఇచ్చిన అసైన్డ్‌ భూముల యాజమాన్య పట్టాలు ఇవ్వడానిఇక హక్కులు ఇవ్వాలని చంద్రశేఖర్‌ కోరారు. భవిష్యత్తులో దీనిపై డిక్లరేషన్‌ చేస్తాం. దళితుల మధ్య వర్గీకరణ చిచ్చు లేకుండా పంచాయితీ తెంచుతాం అని తెలిపారు.

ఇదిలా ఉండగా.. గతంలో టీడీపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లో పనిచేసిన చంద్రశేఖర్‌.. మూడేళ్ల క్రితం బీజేపీలో చేరారు. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. గత కొంత కాలంగా బీజేపీకి దూరంగా ఉంటున్న చంద్రశేఖర్.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్‌లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన ఆయన.. 1985 నుంచి 2008 వరకు వరుసగా 5 సార్లు వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్‌లో కొత్త టెన్షన్‌.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పొలిటికల్‌ వార్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top