‘సీఎం రేవంత్‌ ప్రమేయంతోనే ఆ టెండర్లు.. అక్రమాల నిగ్గు తేల్చాలి’ | Ex Minister KTR Comments On CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

‘సీఎం రేవంత్‌ ప్రమేయంతోనే ఆ టెండర్లు.. అక్రమాల నిగ్గు తేల్చాలి’

Sep 21 2024 2:28 PM | Updated on Sep 21 2024 3:54 PM

Ex Minister KTR Comments On CM Revanth Reddy

అమృత టెండర్లలో అక్రమాలపై నిగ్గు తేల్చాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: అమృత టెండర్లలో అక్రమాలపై నిగ్గు తేల్చాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ‌, అమృత్‌ టెండర్లలో సీఎం కుటుంబీకులు భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. సీఎం బావమరిది కంపెనీకి ఎలాంటి అర్హతలు లేకున్నా దొడ్డిదారిన రూ.1,137 కోట్ల పనులు దక్కించుకున్నారన్నారు.

ఇండియన్‌ హ్యూమ్‌ పైప్‌ కంపెనీని రంగంలోకి దించి రేవంత్‌ కుటుంబం తాగునీటి సరఫరా పనులను దక్కించుకుంది. అమృత టెండర్లపై తక్షణం విచారణ జరిపితే అన్ని నిజాల బయటపడతాయి. ముఖ్యమంత్రి ప్రమేయంతోనే టెండర్లు జరిగాయి. తక్షణం అమృత్‌ పథకం టెండర్లను నిలిపివేయాలి’’ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

అమృత్ టెండర్లలో రేవంత్ కుటుంబం భారీ అవినీతి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement