మీ విచారణలో నిష్పాక్షికత లేదు | EX Minister Jagdish Reddy letter to Commissioner of Inquiry | Sakshi
Sakshi News home page

మీ విచారణలో నిష్పాక్షికత లేదు

Jun 30 2024 4:26 AM | Updated on Jun 30 2024 4:26 AM

EX Minister Jagdish Reddy letter to Commissioner of Inquiry

రాజకీయ ఆరోపణలకు ఊతమిచ్చేలా పనిచేస్తున్నారు

విద్యుత్‌లో కేసీఆర్‌ సాధించిన విజయాలకు మసిపూస్తున్నారు 

నిబంధనల మేరకే ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్‌ ఒప్పందాలు 

కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీకి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి లేఖ

సాక్షి, హైదరాబాద్‌: కేసీఆర్‌ ప్రభుత్వం విద్యుత్‌ రంగంలో సాధించిన అసాధారణ విజయాలకు మసిపూసేలా పనిచేస్తున్నారంటూ విద్యుత్‌ ఒప్పందాలపై ప్రభుత్వం నియమించిన కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీ జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మీ విచారణలో నిష్పాక్షికత లేదని, నిరాధారమైన ఆరోపణలకు ఊతమిచ్చేలా వ్యవహరించడం బాధాకరమంటూ ఏడు పేజీల లేఖను జగదీశ్‌రెడ్డి శనివారం తన పీఏ ద్వారా కమిషన్‌కు పంపించారు. అనంతరం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీ ఉద్దేశాలను తప్పుబట్టారు. కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి మీడియా సమావేశం పెట్టి లీకులు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.

పద్నాలుగేళ్లు తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా పదేళ్ల కాలంలో అనేక రంగాల్లో దేశంలోనే తెలంగాణను ప్రథమ స్థానంలో నిలిపారన్నారు. నిమిషం కరెంటు కోత లేకుండా రైతులు, పారిశ్రామికవేత్తలకు, గృహాలకు విద్యుత్‌ అందిస్తే... ఏదో జరిగిపోయిందన్నట్లుగా, జరిగిన నష్టాన్ని లెక్కకట్టడమే మిగిలిందన్నట్లుగా మాట్లాడడం, మరునాడే ఆరువేల కోట్ల నష్టం అని అన్ని ప్రధాన పత్రికల్లో వార్తలు రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. విచారణ జరుగుతున్న సమయంలోనే ఇలాంటి వార్తలు వచి్చనందున వారికి ఆ సమాచారం ఎలా వచి్చంది, ఏ ఆధారాలతో ఆ వార్తను ప్రచురించారనే అంశాలు కూడా విచారణలో భాగం కావలసిన అవసరం ఉందని జగదీశ్‌రెడ్డి చెప్పారు.  

ఛత్తీస్‌గఢ్‌ నుంచి రూ.3.90కి కొన్నాం 
తాము ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన సమయంలో రాష్ట్రంలో విద్యుత్‌ తీవ్ర సంక్షోభంలో ఉందని, 2700 మెగావాట్ల విద్యుత్‌ కొరత ఉందని జగదీశ్‌ రెడ్డి లేఖలో వివరించారు. ఆ పరిస్థితుల్లో తెలంగాణకు వచి్చన 400 మెగావాట్ల సీలేరు జలవిద్యుత్‌ కేంద్రాన్ని కూడా ఏపీ ప్రభుత్వం తీసుకుందని, ఈ పరిస్థితుల్లో విద్యుత్‌ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అప్పటి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ పీజీసీఐఎల్‌ మహారాష్ట్రలోని వార్ధా నుంచి డిచ్‌పల్లి వరకు ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ నిర్మాణం ప్రారంభించిందని, పీజీసీఐఎల్‌లో వాటా ఉండాలంటే ఏదో ఒక సంస్ధతో విద్యుత్‌ ఒప్పందం ఉండాలన్న నిబంధన మేరకు ఛత్తీస్‌గఢ్‌తో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంఓయూ చేసుకున్నారని తెలిపారు.

ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విద్యుత్‌ను రూ.17కు కొంటున్న పరి స్థితి ఉండగా, ఛత్తీస్‌గఢ్‌ నుంచి రూ.3.90కి యూని ట్‌ చొప్పున కొనాలని తెలంగాణ ఈఆర్‌సీ నిర్ణయించిందని వివరించారు. తెలంగాణ తీసుకున్నప్పుడే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు రూ.4.90కి విద్యుత్‌ తీసుకున్నారన్నారు. రాష్ట్ర కరెంటు డిమాండ్‌ మేరకు విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి కేసీఆర్‌ శ్రీకారం చుట్టారని, సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో దేశంలో 17 ప్రాజెక్టులు నిర్మాణం అవుతున్నాయని చెప్పారు. భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ను 800 మెగావాట్లతో సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో, యాదాద్రి ప్లాంట్‌ను సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో నిర్మాణం చేపట్టామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోతో సబ్‌ క్రిటికల్, సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీ అనే తేడా లేకుండా పోయిందని వివరించారు.    

Advertisement
 
Advertisement
Advertisement