TN: అన్నామలైకి కనిమొళి స్ట్రాంగ్‌ కౌంటర్‌ | DMK MP Kanimozhi Counter To State BJP Chief Annamalai | Sakshi
Sakshi News home page

తమిళనాడు బీజేపీ చీఫ్‌ అన్నామలైకి కనిమొళి స్ట్రాంగ్‌ కౌంటర్‌

Mar 29 2024 8:07 AM | Updated on Mar 29 2024 8:58 AM

Dmk Mp Kanimozhi Counter To State Bjp Chief Annamalai - Sakshi

చెన్నై: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకి డీఎంకే ఎంపీ కనిమొళి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం(మార్చ్‌ 28)రాత్రి కరూర్‌లో నిర్వహించిన సభలో కనిమొళి మాట్లాడారు. ‘ప్రస్తుతం జైలులో ఉన్న మాజీ మంత్రి సెంథిల్‌ బాలాజీ గతంలో కరూర్‌ నుంచి పోటీ చేశారు. సెంథిల్‌ బాలాజీ భయంతోనే  ఈ ఎన్నికల్లో అన్నామలై కరూర్‌ నుంచి పోటీ చేయడం లేదు’ అని కనిమొళి సెటైర్లు వేశారు.

గతంలో కరూర్‌ నుంచి ఒక మంత్రి ఉండేవాడని, ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నాడని ఇటీవల కరూర్‌లో నిర్వహించిన ప్రచారంలో అన్నామలై ప్రస్తావించినందునే కనిమొళి ఆయనకు కౌంటర్‌ ఇచ్చారు. పార్లమెంటులో మాట్లాడిన ఎంపీలను సస్పెండ్‌ చేస్తారని, బయటమాట్లాడిన వారిని జైలుకు పంపుతారని కేంద్ర ప్రభుత్వంపై కనిమొళి విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఒక్క సీటు గెలుచుకునే అవకాశాలు కూడా లేవన్నారు. ప్రస్తుతం కరూర్‌ నుంచి ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్‌ సిట్టింగ్ ఎంపీ జోతిమణి పోటీ చేస్తున్నారు.

ఇదీ చదవండి.. కర్ణాటకలో ఏకైక కాంగ్రెస్‌ ఎంపీ రాజీనామా

Advertisement
 
Advertisement
Advertisement