కర్ణాటకలో ఏకైక కాంగ్రెస్ ఎంపీ నామినేషన్ | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో ఏకైక కాంగ్రెస్ ఎంపీ నామినేషన్

Published Thu, Mar 28 2024 9:18 PM

DK Suresh files nomination from Bangalore Rural - Sakshi

కర్ణాటకలో ఏకైక కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ నామినేషన్‌ వేశారు. కర్ణాటకలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ఏకైక కాంగ్రెస్ అభ్యర్థి ఈయనే. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలకు బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుంచి డీకే సురేష్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. 

ఈ సందర్భంగా డీకే సురేష్‌ వెంట రామనగర జిల్లా ఇన్‌చార్జి మంత్రి రామలింగారెడ్డి తదితరులు ఉన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ తమ్ముడే ఈ డీకే సురేష్‌. మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి భార్య అనిత కుమారస్వామిని 2013 ఉప ఎన్నికలో ఆయన ఓడించారు. 

మరోవైపు మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ అల్లుడు, జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి బావమరిది అయిన ప్రముఖ కార్డియాక్ సర్జన్ సీఎన్ మంజునాథ్‌ను బీజేపీ-జేడీఎస్ కూటమి పోటీకి దింపింది. బీజేపీ గుర్తుపై పోటీ చేస్తున్న మంజునాథ్ 17 ఏళ్ల పాటు ప్రభుత్వ యాజమాన్యంలోని జయదేవ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌కు సారథ్యం వహించి ఈ ఏడాది జనవరిలో పదవీ విరమణ చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement