‘రామాయణం’ రామునికి టీవీ సీత శుభాకాంక్షలు | Dipika Chikhlia Congratulates Arun Govil | Sakshi
Sakshi News home page

‘రామాయణం’ రామునికి టీవీ సీత శుభాకాంక్షలు

Jun 5 2024 9:06 AM | Updated on Jun 5 2024 9:18 AM

Dipika Chikhlia Congratulates Arun Govil

రామానంద్ సాగర్ రూపొందించిన ‘రామాయణం’లో రాముని పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు సంపాదించుకున్నారు. తాజాగా యూపీలోని మీరట్‌ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన విజయం సాధించారు. దీంతో అరుణ్‌ గోవిల్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

టీవీ షో ‘రామాయణం’లో సీత పాత్రలో కనిపించిన దీపికా చిఖాలియా కూడా  అరుణ్‌ గోవిల్‌కు అభినందనలు తెలిపారు. అలాగే తన ఇన్‌స్టాలో ఒక వీడియోను షేర్‌ చేశారు. ఇందులో ఆమె అరుణ్‌ గోవిల్‌తో ముచ్చటిస్తున్న దృశ్యాలున్నాయి. క్యాప్షన్‌లో అరుణ్‌ గోవిల్‌కు అభినందనలు తెలిపారు.

తన విజయం తర్వాత అరుణ్ గోవిల్ ఒక పోస్ట్‌ను షేర్‌ చేశారు. దాని క్యాప్షన్‌లో ‘మీరట్ లోక్‌సభ నియోజకవర్గపు ఓటర్లు, కార్యకర్తలు, అగ్ర నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరందరూ నాపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు. నేను మీ నమ్మకాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తాను...జై శ్రీరామ్’ అని పేర్కొన్నారు.

బీజేపీ అభ్యర్థి అరుణ్ గోవిల్ తన సమీప ప్రత్యర్థి సమాజ్ వాదీ పార్టీకి చెందిన సునీతా వర్మపై 10,585 ఓట్ల తేడాతో గెలుపొందారు. అరుణ్‌ గోవిల్‌కు మొత్తం 5,46,469 ఓట్లు వచ్చాయి.

Advertisement
 
Advertisement
Advertisement