ఢిల్లీ మద్యం కుంభకోణం: రూ.52 కోట్ల మనీష్ సిసోడియా ఆస్తుల అటాచ్‌..

Delhi Liquor Policy Case Assets Of Manish Sisodia Other Accused Seized - Sakshi

ఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్‌ నేత, ఢిల్లీ మాజీ డిఫ్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆయన భార్య, ఇతరులకు చెందిన రూ.52 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మనీష్ సిసోడియాను మార్చిలో ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం జ్యూడీషియల్ కస్డడీలో ఉన్నారు. 

అన్‌దీప్‌ సింగ్ ధాల్, రాజేశ్ జోషీ, గౌతమ్ మల్హోత్రాతో పాటు మరికొందరి ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. మనీష్ సిసోడియాకు చెందిన బ్యాంకు అకౌంట్లలో రూ.11 లక్షలను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. సిసోడియాకు సన్నిహితుడైన ప్రముఖ వ్యాపారవేత్త దినేష్ అరోరాను అరెస్టు చేసిన మరుసటి రోజే ఈడీ ఆస్తుల అటాచ్ చర్యలకు పూనుకుంది.

దేశ రాజధానిలోని నూతనంగా తీసుకువచ్చిన మద్యం పాలసీలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఢిల్లీ మాజీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు మరికొందరిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో సీబీఐ దర్యాప్తు చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గత ఏడాదే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే పలువురి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

మనీష్ సిసోడియా ఇమేజ్‌ను దెబ్బతీయడానికే కేంద్రం కట్టుకథలు అల్లుతోందని అన్నారు. ఈడీ సీజ్‌ చేసిన రెండు ఫ్లాట్‌లలో ఒకటి 2005లోనే కొనుగోలు చేయగా.. మరొకటి 2018లో కొన్నట్లు చెప్పారు. మద్యం పాలసీ కంటే ముందే ఆ ఆస్తులను కొన్నట్లు చెప్పారు. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఆప్‌ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకువచ్చిందని కేంద్రం ఆరోపిస‍్తోంది.

ఇదీ చదవండి: అవినీతే కాంగ్రెస్‌ ఊపిరి

 
  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top