Geniben Thakor: అమిత్‌ షాను సైతం డబ్బు సాయం కోరిందట! | Congress Geniben Thakor Asks Money From BJP's Amit Shah Also | Sakshi
Sakshi News home page

గుజరాత్‌లో నెగ్గిన ఏకైక కాంగ్రెస్‌ ఎంపీ.. అమిత్‌ షాను సైతం డబ్బు సాయం కోరిందట!

Jun 12 2024 2:21 PM | Updated on Jun 12 2024 2:57 PM

Congress Geniben Thakor Asks Money From BJP's Amit Shah Also

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఆమెది స్ఫూర్తిదాయక విజయం. అంతేకాదు.. గుజరాత్‌ నుంచి కాంగ్రెస్‌ గెలిచిన ఏకైక సీటు కూడా అదే. అందుకే సర్వత్రా ఆసక్తికర చర్చ నడిచింది. 

బనస్కాంతా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి జెనిబెన్ నాగాజీభాయ్ ఠాకోర్(48).. ఎన్నికల ప్రచారానికి కావాల్సిన సొమ్మును క్రౌడ్‌ ఫండింగ్‌(ప్రజా సేకరణ ద్వారా డబ్బు) ద్వారా సేకరించుకున్నారు. అంతేకాదు.. ఫలితాలు వెలువడ్డాక కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఆమె గెలుపు ప్రకటన నేపథ్యంలో భావోద్వేగానికి గురైన దృశ్యాలు సైతం వైరల్‌ అయ్యాయి. అయితే ఆమె ఎన్నికకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఒకటి ఇప్పుడు వెలుగు చూసింది. 

తన ప్రచారం కోసం ప్రజల నుంచి విరాళాలు సేకరించిన ఆమె.. బీజేపీ అగ్ర నేత.. కేంద్ర మంత్రి అమిత్‌ షాను కూడా అడిగారట. ఆయన తన క్లాస్‌మేట్‌ అని, ఒక సోదరుడిగా(అమిత్‌ భాయ్‌ అని ప్రస్తావిస్తూ) భావించి సాయం కోరారట.  ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలియజేశారంటూ  ప్రముఖ జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇలాంటి అసాధారణమైన విజయం సాధించిన జెనిబెన్‌ను రోల్‌ మోడల్‌గా తీసుకోవాలని రాజకీయ నేతలకు  సలహా ఇస్తున్నారాయన. 

Advertisement
 
Advertisement
Advertisement