భారతీయ ఆత్మ..  మన రాజ్యాంగం  | Constitution as the greatest weapon against injustice says Congress party | Sakshi
Sakshi News home page

భారతీయ ఆత్మ..  మన రాజ్యాంగం 

Nov 27 2026 6:37 AM | Updated on Nov 27 2026 6:37 AM

Constitution as the greatest weapon against injustice says Congress party

‘ఎక్స్‌’ పోస్టులో రాహుల్‌ వ్యాఖ్య

న్యూఢిల్లీ: అన్యాయాన్ని ఎదిరించేందుకు భారత రాజ్యాంగం సామాన్యుడికి ఉన్న అతిపెద్ద ఆయుధమని కాంగ్రెస్‌ పార్టీ అభివర్ణించింది. రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని, పోరాడతామని ఆ పార్టీ నేతలు గురువారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్పష్టం చేశారు. రాజ్యాంగానికి అర్థం కల్పించే అత్యంత కీలకమైన ఓటు హక్కుపై బీజేపీ దాడి చేస్తోందని ఆరోపించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాం«దీసహా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, వయనాడ్‌ ఎంపీ ప్రియాంక గాంధీ తదితరులు ఎక్స్‌ వేదికగా రాజ్యాంగ దినోత్సవ సందేశాలను పంచుకున్నారు.  

అన్యాయంపై పోరుకు ఆయుధమైనా ఈ దేశపు ప్రజాస్వామ్యానికి పునాదైనా భారత రాజ్యాంగమేనని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ప్రకటించారు. ఎలాంటి పరిస్థితిలోనైనా భారత రాజ్యాంగాన్ని రక్షించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ‘‘భారత రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదు అది దేశ ఆత్మ. ప్రతి పౌరుడి గౌరవానికి రక్షణ కవచం, ప్రతి గొంతుకకు బలం, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలకు సంరక్షకురాలు. అన్యాయాన్ని ఎదిరించేందుకు అతిపెద్ద ఆయుధం’’ అని పేర్కొన్నారు. అంతేకాకుండా... అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రజలకున్న అతిపెద్ద ఆయుధం కూడా ఇదేనని కొనియాడారు. ‘‘రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నేను నా ప్రతిజ్ఞను పునరుద్ఘాటిస్తున్నా. ప్రతి భారతీయుడి హక్కు కోసం పోరాడటం కొనసాగిస్తా. ఎలాంటి పరిస్థితిలోనైనా రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రయతి్నంచడం ఆపను’’అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement