ఇది ప్రజాస్వామ్యానికి ఒక చీకటి రోజు: సీఎం రేవంత్‌ | CM Revanth Condemns Rejection of Meenakshi Natarajan’s Nomination | Sakshi
Sakshi News home page

ఇది ప్రజాస్వామ్యానికి ఒక చీకటి రోజు: సీఎం రేవంత్‌

Jun 9 2026 9:17 PM | Updated on Jun 9 2026 9:38 PM

CM Revanth Condemns Rejection of Meenakshi Natarajan’s Nomination

హైదరాబాద్:  రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణను సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించడంలో బీజేపీ కుట్ర ఉందని ధ్వజమెత్తారు. 'వోట్ చోరీ', 'ఎస్ఐఆర్' తర్వాత, ఇప్పుడు బీజేపీ 'సీట్ చోరీ'కి పాల్పడుతోందని విమర్శించారు.  ఇది ప్రజాస్వామ్యం జరిగిన దాడిగా అభివర్ణించారు సీఎం రేవంత్‌. 

‘తెలంగాణలో మీనాక్షి నటరాజన్ పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు.  జైరాం రమేష్ నేతృత్వంలో కాంగ్రెస్ నాయకత్వం ఎన్నికల కమిషన్‌ను కలిసేందుకు వెళితే అడ్డుకున్నారు. గెలవలేక కుట్ర చేసి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించారు. ప్రజల గొంతులను అణచివేయడమే. ప్రజాస్వామ్యానికి ఇది ఒక చీకటి రోజు. దీనిని పౌరులందరూ ఖండించాలి. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం… న్యాయం జరిగే వరకు పోరాడుతాం’ అని హెచ్చరించారు. 

మీనాక్షి నటరాజన్‌కు షాక్‌.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement