మీనాక్షి నటరాజన్‌కు షాక్‌.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం | Meenakshi Natarajan nomination rejected | Sakshi
Sakshi News home page

మీనాక్షి నటరాజన్‌కు షాక్‌.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

Jun 9 2026 6:54 PM | Updated on Jun 9 2026 7:37 PM

Meenakshi Natarajan nomination rejected

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు షాక్ తగిలింది. ఆమె రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైంది. తెలంగాణలో క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు అపిడవిట్‌లో వెల్లడించలేదని, ఆస్తుల వివరాలు తెలపలేదని  బీజేపీ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఎన్నికల కమిషన్ నామినేషన్‌ను తిరస్కరించింది. కాగా  మధ్యప్రదేశ్‌నుంచి మీనాక్షి నటరాజన్‌ రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ వేశారు.

కాగా తొలినుంచి మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎ‍న్నికలపై ఉత్కంఠ సాగింది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తంగా 230 స్థానాలుండగా, బీజేపీకి సొంతంగా 165 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 64 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. గెలవడానికి సుమారు 58 ఓట్లు అవసరం. అయితే కాంగ్రెస్ ఓట్లతో సులువుగా  ఒక రాజ్యసభ సీటు గెలువగలదు. 

అయితే బీజేపీ వద్ద మరో 49 ఓట్లు మిగులుతాయి. ఒకవేళ బీజేపీ మూడో అభ్యర్థిని బరిలోకి దింపితే విజయానికి 9 ఓట్లు ప్రతిపక్షం నుంచి రావాల్సి ఉంటుంది. ఈ ఉత్కంఠల నడుమ‘పార్టీ ఆదేశిస్తే మూడో అభ్యర్థిని గెలిపించగలం’ అని బీజేపీ సీనియర్‌ మంత్రి కైలాష్‌ విజయవర్గీయ కామెంట్ చేశారు. దీంతో కాంగ్రెస్‌ను క్రాస్‌ ఓటింగ్‌ భయం వెంటాడింది. ఈ నేపథ్యంలో ఆమె అభ్యర్థిత్వం రద్దవడం సంచలనంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement