రాజీనామాకు సిద్ధమా హరీష్‌?: రేవంత్‌ ఘాటు వ్యాఖ్యలు | CM Revanth Challenge To BRS MLA Harish Rao | Sakshi
Sakshi News home page

రాజీనామాకు సిద్ధమా హరీష్‌?: రేవంత్‌ ఘాటు వ్యాఖ్యలు

Aug 15 2024 5:08 PM | Updated on Aug 15 2024 5:22 PM

CM Revanth Challenge To BRS MLA Harish Rao

సాక్షి, వైరా: తెలంగాణలో మరోసారి రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నాం. హరీష్‌రావు సవాల్‌ ప్రకారం.. రాజీనామా చేయాలని సీఎం రేవంత్‌ డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ బతుకు బస్టాండ్‌ అయ్యిందంటూ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. 

కాగా, సీఎం రేవంత్‌ వైరాలో రైతు రుణమాఫీ సభలో మాట్లాడుతూ.. తెలంగాణలో రైతు రుణమాఫీని భట్టి విక్రమార్క సవాల్‌గా తీసుకున్నారు. విక్రమార్క.. రాహుల్‌ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టడానికి లెక్కలు వేసి హామీని నెరవేర్చారు. రుణమాఫీ చేస్తే.. హరీష్‌రావు రాజీనామా చేస్తాను అన్నాడు. సిగ్గు, శరం ఉంటే వెంటనే ఆయన రాజీనామా చేయాలి. ఎంత మంది అడ్డుపడినా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం. సవాల్‌ చేసిన మాట ప్రకారం.. హరీష్‌ రావు రాజీనామా చేయాలి. సిద్దిపేటకు పట్టిన పీడ విరగడవుతుంది. హారీష్‌రావు.. అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి ముక్కు నేలకు రాసి క్షమాపణలు అడగాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌పై సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ బతుకు బస్టాండ్‌ అయ్యింది. ప్రజలే తప్పు చేశారన్నట్టుగా కేటీఆర్‌ మాట్లాడటం సిగ్గుచేటు. బీఆర్‌ఎస్‌ను బంగాళాఖాతంలోకి విసిరేసే బాధ్యత తీసుకుంటా. తెలంగాణలో బీజేపీకి చోటు లేదు. ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌కు గాడిద గుడ్డు ఉంది. ఖమ్మం జిల్లా ప్రజలు కాంగ్రెస్‌కు అండగా ఉండాలి. బీఆర్‌ఎస్‌ను బద్దలకొడుతాం.. బీజేపీని బొందపెడతాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement