రాజకీయ వారసులపై మమత ఆసక్తికర కామెంట్స్‌ | CM Mamata Banerjee Interesting Comments On Her Political Successor | Sakshi
Sakshi News home page

రాజకీయ వారసులపై మమత ఆసక్తికర కామెంట్స్‌

Dec 7 2024 11:41 AM | Updated on Dec 7 2024 11:48 AM

CM Mamata Banerjee Interesting Comments On Her Political Successor

కోల్‌కతా:తన రాజకీయ వారసులెవరన్న దానిపై పశ్చిమబెంగాల్‌ సీఎం తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె తాజాగా ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయమై మాట్లాడారు. ‘నా రాజకీయ వారసులెవరన్నదానిపై తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. 

పార్టీ అంటే నేనొక్కదాన్నే కాదు.మా పార్టీ నేతలు, కార్యకర్తలంతా క్రమశిక్షణ కలిగిన సైనికులు. మాకు ఎమ్మెల్యులు,ఎంపీలు,బూత్‌ వర్కర్లున్నారు. ఇంతమంది కలిస్తేనే పార్టీ అవుతుంది. నా రాజకీయ వారసులపై పార్టీలో ఉన్నవారంతా కలిసి నిర్ణయం తీసుకుంటారు. పార్టీలోకి ఈరోజు కొత్తగా వచ్చినవారు రేపు సీనియర్లవుతారు’అని మమత వ్యాఖ్యానించారు.

తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో ప్రస్తుతం సీనియర్లు,జూనియర్ల మధ్య గ్రూపు తగాదాలు జరుగుతున్న వేళ మమత వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా, తృణమూల్‌ కాంగ్రెస్‌లో మమత తర్వాత ఆమె మేనల్లుడు అభిషేక్‌బెనర్జీ పార్టీ పగ్గాలు తీసుకుంటారని  ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి: ఢిల్లీలో ఓట్ల తొలగింపు.. బీజేపీపై కేజ్రీవాల్‌ ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement