చంద్రబాబు సర్కార్‌.. మళ్లీ కన్సల్టెంట్ల రాజ్యం | Chandrababu Naidu Government Appointed 11 Consultants, Check More Details Inside | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సర్కార్‌.. మళ్లీ కన్సల్టెంట్ల రాజ్యం

Nov 5 2024 9:16 AM | Updated on Nov 5 2024 9:55 AM

Chandrababu Government Appointed 11 Consultants

ఈ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ యూనిట్‌కు కేపీఎంజీని ఏజెన్సీగా ఎంపిక చేశారు. ఇందులో ఒక టీం లీడర్‌తోపాటు 10 మంది కన్సల్టెంట్లను తీసుకో­నున్నారు. ఇందుకోసం 8 నెలలకు రూ.3.28 కోట్లు చెల్లించనున్నారు.

11 మంది కన్సల్టెంట్లను నియమించిన కూటమి సర్కారు

8 నెలల కోసం రూ.3.28 కోట్లు కేటాయింపు

సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలన అంటే కన్సల్టెంట్లు, విదేశీ సంస్ధలకు రూ.వందల కోట్లు దోచిపెట్టడం అనేది అందరికీ తెలిసిందే. తాజాగా కన్స­ల్టెంట్ల రాజ్యం తిరిగి ప్రారంభమైంది. రాష్ట్ర ఆదాయం పెంచేందుకు 11మంది కన్సల్టెంట్లతో ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ను రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ (ఏపీఎస్‌డీపీఎస్‌)లో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ యూనిట్‌కు కేపీఎంజీని ఏజెన్సీగా ఎంపిక చేశారు. ఇందులో ఒక టీం లీడర్‌తోపాటు 10 మంది కన్సల్టెంట్లను తీసుకో­నున్నారు. ఇందుకోసం 8 నెలలకు రూ.3.28 కోట్లు చెల్లించనున్నారు. అవస­రాన్ని బట్టి కన్సల్టెంట్ల కాల వ్యవధిని మరింత పెంచనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్‌ కుమార్‌ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థిక ప్రణాళిక, స్థూల ఆర్థిక వ్యవస్థ ద్వారా రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికకు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ అవసరమైన సహా­యం అందిస్తుంది.

వనరుల సమీకరణతోపాటు కేటాయింపులు, సంస్థాగ­తంగా రా­ష్ట్రా­న్ని ఆర్థికంగా బలోపేతం చేయడంపై పర్యవేక్షణ, డేటా విశ్లే­షణ, పరి­శోధన వంటి పనులను కన్సల్టెంట్లు నిర్వహిస్తారు. అలాగే ఆదా­యం పెంపుదల, వ్యయ నిర్వహణకు కన్సల్టెంట్లు అవసరమైన సహకా­రం అందిస్తారు. వ్యూహాత్మక పెట్టుబడులు, స్థూల ఆర్థిక పరిశోధన, ఆర్థిక విశ్లేషణకు చెందిన డేటాను రూపొందించనున్నారు. ఆదాయ మార్గాలను పెంచడంతోపాటు ఆర్థిక నిర్వహణను మెరుగుపరచడం, ఆర్థిక క్రమశిక్షణకు అవసరమైన విధానాలను ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ రూపొందించనుంది.  

Advertisement
 
Advertisement
Advertisement