విశ్వాస పరీక్ష నెగ్గిన చంపయ్ సర్కారు | JMM Leader Champai Soren Soren Wins Floor Test - Sakshi
Sakshi News home page

విశ్వాస పరీక్ష నెగ్గిన చంపయ్ సర్కారు

Published Mon, Feb 5 2024 2:19 PM

Champay Sarkar Passed Floor Test - Sakshi

రాంచీ: జార్ఖండ్ రాజకీయ సంక్షోభానికి తెరపడింది. చంపయ్ సొరెన్ సర్కారు విశ్వాస పరీక్షలో నెగ్గింది. చంపయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 47 ఓట్లు పడ్డాయి. వ్యతిరేకంగా 29 ఓట్లు వచ్చాయి. హేమంత్ సొరెన్ అరెస్టు అనంతరం జార్ఖండ్‌లో నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంపయ్ సొరెన్ ప్రభుత్వానికి నేడు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరిగింది.

జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలకు ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో జార్ఖండ్‌ ముక్తి మోర్చా(28), కాంగ్రెస్‌(16), ఆర్జేడీ(1) కూటమికి 45 సీట్లు ఉన్నాయి. సీపీఐ(ఎంఎల్‌) ఏకైక ఎమ్మెల్యే ఆ కూటమికి బయటి నుంచి మద్దతిస్తుండగా.. బీజేపీతో కూడిన విపక్ష కూటమికి 29 మంది ఎమ్మెల్యేలున్నారు. బలపరీక్షలో గెలవాలంటే జేఎంఎం కూటమికి 41 ఓట్లు వస్తే సరిపోతుంది. అయితే, ప్రస్తుతం కూటమి బలపరీక్షలో విజయం సాధించింది.

ఇదీ చదవండి: రసవత్తరంగా జార్ఖండ్‌ రాజకీయం.. సోరెన్‌ సర్కార్‌కు బలపరీక్ష

Advertisement
 

తప్పక చదవండి

Advertisement