BSP RS Praveen Kumar Counter Comments On Minister KTR Over Govt Lands Auction In Twitter - Sakshi
Sakshi News home page

KTR Old Tweet Viral: హలో కేటీఆర్‌గారూ.. ఈ ఫొటో గుర్తుందా?

Aug 5 2023 10:59 AM | Updated on Aug 5 2023 1:02 PM

BSP RS Praveen Kumar Counters Minister KTR On Twitter Land Auction Viral - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ భూముల అమ్మకంపై బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ట్విట్టర్‌ వేదికగా మంత్రి కేటీఆర్‌పై సెటైర్లు వేశారు. ‘ప్రభుత్వ భూముల వేలం పాటను ఆపివేయాలి. ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని మానుకోవాలి’అంటూ కేటీఆర్‌ ఓ ప్లకార్డు ప్రదర్శిస్తున్న పాత ఫొటోను జత చేస్తూ శుక్రవారం ఓ ట్వీట్‌ చేశారు.

‘తమరు ప్రతిపక్షంలో ఉంటే చెప్పేవి శ్రీరంగనీతులు, అధికారంలోకి వచి్చన తర్వాత ఆ నీతులు ఎక్కడో కొట్టుకొని పోయినయి! ఐనా చెప్పిందల్లా చేయడానికి మీరేమన్నా సన్నాసులా (నాన్న గారి మాటల్లోనే)!. మీరు మీ పత్రికల ద్వారా గతాన్ని తుడిచేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నప్పటికీ చరిత్రను మరిచిపోయేంత సన్నాసులం మేం కాదు. 75 ఏళ్ల నుంచి 99 శాతం ఉన్న బహుజనులు 1శాతం ఉన్న ఆధిపత్య పాలకులకు ఓట్లేసి గెలిపిస్తే పేదల భూములను కాపాడలేదు సరికదా అమాంతంగా మింగేసిండ్రు. బీఎస్పీ అధికారంలోకి వచి్చన వెంటనే పేదల భూములకు రక్షణ కలి్పస్తాం’అని తన ట్వీట్‌లో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

కాగా వందల కోట్లకు అసైన్డ్‌ భూములను కొంటున్న కేసీఆర్, కేటీఆర్‌ బినామీల నుంచి భూములను తిరిగి తీసుకుంటామని, వాటిని పేద రైతులకు పంచుతామని ట్విట్టర్‌లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు. నిన్న కోకాపేట, రేపు బుద్వేల్, ఎల్లుండి ఆర్‌ఆర్‌ఎర్‌ చివరికి మిగిలేది గోచి గుడ్డనే అని ఎద్దేవాచేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement