లిక్కర్‌ స్కాంలో ప్రభుత్వం   | BSP President Praveen Kumar Slams On TRS Leaders Over Delhi Liquor Scam | Sakshi
Sakshi News home page

లిక్కర్‌ స్కాంలో ప్రభుత్వం  

Dec 2 2022 1:12 AM | Updated on Dec 2 2022 1:12 AM

BSP President Praveen Kumar Slams On TRS Leaders Over Delhi Liquor Scam - Sakshi

అలంపూర్‌లో పాదయాత్రగా వస్తున్న ప్రవీణ్‌కుమార్‌  

అలంపూర్‌/అలంపూర్‌ రూరల్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లిక్కర్‌ స్కాంలో మునిగిపోయిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ చెప్పారు. గురువారం ఆయన జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో నిర్వహించిన బీఎస్పీ పాదయాత్ర ముగింపు సమావేశంలో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ నాయకులు ఈ స్కాంలో రూ.వేల కోట్లు దోచుకున్నారని ఆయన ఆరోపించారు.

ప్రజల అవసరాల కోసం ఖర్చు చేయాల్సిన డబ్బును ఇతర దేశాలు, రాష్ట్రాల్లో లిక్కర్‌ ఇతర దందాల్లో పెట్టుబడులు పెట్టారని విమర్శించారు. ఇందులోని నిందితులు తమ సెల్‌ఫోన్లను సైతం పగలగొట్టారని, ఇలాంటి నీచమైన పనిని కరడు కట్టిన నేరస్తులు సైతం చేయరని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు దమ్ముంటే బీసీల కులగణన చేపట్టి, రిజర్వేషన్లు పెంచేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement