
మంత్రివర్గ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి
దొడ్డు వడ్లకూ బోనస్ ఇచ్చేలా పోరాడతాం: హరీశ్
సాక్షి, హైదరాబాద్: కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామనే రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వానాకాలం నుంచి అన్ని రకాల వడ్లకు క్వింటాలుకు రూ. 500 చొప్పున బోనస్ ఇవ్వాలన్నారు. దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇచ్చేలా బీఆర్‌ఎస్ పోరాడుతుందన్నారు. వరి ధాన్యానికి బోనస్ చెల్లింపు అంశంపై రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై హరీశ్‌రావు మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
వరి ధాన్యానికి బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్‌గాం«దీ, ప్రియాంకగాందీతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కూడా హామీ ఇచి్చన విషయాన్ని హరీశ్‌రావు గుర్తు చేశారు. సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం మోసానికి పరాకాష్టగా పేర్కొన్నారు. యాసంగిలో సాగు చేయని సన్నవడ్లకు బోనస్ ప్రకటించడం రైతుల నోట్లో మట్టికొట్టడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. వానాకాలంలో 20 శాతం మాత్రమే సన్నరకం సాగు చేస్తారని, యాసంగిలో 99 శాతం దొడ్డు వడ్లు సాగు చేస్తారన్నారు.
‘భరోసా’రూ.5 వేలేనా?
రాష్ట్రంలో దిగుబడి వచ్చే 1.20 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యానికి బోనస్ ఇచ్చేందుకు రూ.6 వేల కోట్లు అవసరమవుతాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. అయితే కేవలం సన్న రకం వడ్లకే బోనస్ ఇచ్చేందుకు రూ.500 కోట్లు సరిపోతాయని, దీనితో రూ.5,500 కోట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు.
రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని ప్రకటించి, గతంలో మాదిరిగా తొలి విడతలో కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చారన్నారు. రైతు భరోసా కింద రైతులకు బకాయి పడిన రూ.2,500తో పాటు వానాకాలం సాయం రూ.7,500 కూడా కలుపుకుని జూన్ నెలాఖరులోగా ఎకరాకు రూ.10 వేలు ఇవ్వాలన్నారు. వాస్తవ పరిస్థితిని వివరించేందుకు మీడియా సమావేశంలోనే మెదక్ జిల్లా ముత్తాయికోట నుంచి బెజ్జంకి కేంద్రానికి లోడ్ తీసుకెళ్లిన లారీ డ్రైవర్ ప్రభాకర్‌రెడ్డితో హరీశ్ ఫోన్‌లో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment