
సాక్షి, కరీంనగర్: అయోధ్య రామ మందిరంపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రతీ భారతీయుడు పాల్గొనాల్సిన చారిత్రక, ధార్మిక కార్యక్రమమిది అని అన్నారు. అయోధ్య కాంగ్రెస్ ఇలా ఎందుకు వ్యవహరిస్తుందో తెలియడం లేదన్నారు.
కాగా, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బండి సంజయ్ కరీంనగర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. అయోధ్య రాముడు భారతీయ జనతా పార్టీకి మాత్రమే రాముడు కాదు, అందరివాడు. అయోధ్య రామమందిరాన్ని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఎందుకు వ్యతిరేకిస్తుందో అర్థం కావడం లేదు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రతి భారతీయుడూ పాల్గొనాల్సిన చారిత్రక, ధార్మిక కార్యక్రమం అది.
ఎవరు ఎవరి బినామీలో అందరికి తెలుసునంటూ మాజీ ఎంపీ వినోద్‌కు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ బినామీలమైతే సీబీఐ విచారణ మేమే ఎందుకు కోరతాం?. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేయాలని కాంగ్రెస్ ఎందుకు కొరడం లేదు?. కేవలం మేడిగడ్డపైనే ఎందుకు విచారణ కోరింది?. మీరు, మేము ఇద్దరం కలిస్తేనే బీఆర్ఎస్ అవినీతి బయటకు వస్తుంది. నేటి యువతని మద్యానికి, డ్రగ్స్‌కు కొన్ని పార్టీలు బానిసలు చేస్తున్నాయి. కాలేజీలను అడ్డాలుగా చేసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.