
సాక్షి, కరీంనగర్ జిల్లా: తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి కింద ఇచ్చిన శాఖలపై శ్రీహరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ఇచ్చిన శాఖలన్నీ గందరగోళంగా ఉన్నాయి.ఇది అదృష్టమో, దురదృష్టమో తెల్వదు.పదేళ్లలో ఆగమైన శాఖలను నాకు ఇచ్చారు. పశుసంవర్థక శాఖ గందరగోళంగా ఉంది.ఐదు శాఖలూ ఆగమాగంగానే ఉన్నాయి.యువజన సర్వీసులు ఇస్తే నేనేం చేసుకోవాలి..? గొర్రెలు, బర్రెలు ఇస్తే ఏం చేసుకోవాలి?అని వ్యాఖ్యానించారు.