
సాక్షి, కరీంనగర్: జిల్లాలో మంత్రుల పర్యటనలో మళ్లీ విభేదాలు బయటపడ్డాయి. మానకొండూరు నియోజకవర్గం గట్టుదుద్దెనపల్లి సహకార సంఘం నూతన భవన ప్రారంభోత్సవంలో ఫ్లెక్సీల విషయంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావువి తప్ప.. వేదికపైనున్న ఫ్లెక్సిపై మంత్రి అడ్లూరి ఫోటో కనిపించలేదు.
గత క్యాబినెట్ విస్తరణతో విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. తనకు మంత్రి పదవి దక్కుతుందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆశపడి భంగపడ్డ సంగతి తెలిసిందే. అడ్లూరికి మంత్రి పదవి దక్కడంతో కవ్వంపల్లి అలిగారు. ఆ ప్రభావమే ఇవాళ ప్రోటోకాల్ వివాదానికి కారణమనే చర్చ జరుగుతోంది.
స్కూటీని ఢీకొట్టిన మంత్రుల కాన్వాయ్
శంకరపట్నంలో ప్రజాపాలన మీటింగ్ ముగించుకొని వెళ్తున్న మంత్రుల కాన్వాయ్ స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కేశపట్నం గ్రామానికి చెందిన సల్ల వెంకటికి స్వల్ప గాయాలయ్యాయి. కాన్వాయ్‌లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , పొన్నం ప్రభాకర్, పీఆర్వోలు ఉన్నారు.