అలా చేస్తే.. కేంద్రం ఇజ్జత్‌ పోయేది: బండి సంజయ్‌ | Bandi Sanjay Comments On KCR And Revanth Reddy Over Kaleshwaram Project, More Details Inside | Sakshi
Sakshi News home page

Bandi Sanjay: అలా చేస్తే.. కేంద్రం ఇజ్జత్‌ పోయేది

Jun 22 2025 10:42 AM | Updated on Jun 22 2025 11:27 AM

Bandi Sanjay Comments On Kcr And Revanth

సాక్షి, కరీంనగర్ జిల్లా: కాళేశ్వరం విషయంలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందేనని.. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ ప్రభుత్వం రక్షణ కవచంలా మారిపోయిందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏ ఒక్క స్కాంలో కూడా కనీస చర్యలు లేకపోవడమే అందుకు సాక్ష్యమన్నారు. అందుకే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని తెలంగాణా ప్రజలు డిసైడ్ అయ్యారని బండి సంజయ్‌ చెప్పుకొచ్చారు.

‘‘కాళేశ్వరం కేసీఆర్ కుంటుంబానికి ఏటీఎంలా మారింది. నిజాయితీగా పదకొండేళ్ల నుంచి పాలన చేస్తోన్న మోదీ నుంచి అమిత్ షా అందరూ అదే చెప్పారు. కాళేశ్వరం అవినీతి, అక్రమాలతో కూడిన ప్రాజెక్ట్‌. కాళేశ్వరం ప్రాజెక్టులో పని చేసిన అధికారులే వందల కోట్లు సంపాదించుకున్నారు. ఈ అవినీతిపై విచారణను రేవంత్ సర్కార్ అధికారులకే పరిమితం చేయొద్దు. సీడబ్ల్యూసీ 1986 నుంచి 2013 వరకు 160 టీఎంసీల నీటి లభ్యత ఉన్నదంటే.. కేసీఆర్ కుటుంబానికి మాత్రం నీటి లభ్యత ఎందుకు కనిపించలేదు..?’’ అంటూ బండి సంజయ్‌ ప్రశ్నించారు.

‘‘ఈ రిపోర్ట్ ప్రకారం ప్రాజెక్టు కడితే 38 వేల కోట్లలో ప్రాజెక్టు కడితే.. ఇవాళ లక్షా 20 వేల కోట్లు అయ్యేవా?. జాతీయ హోదా ఇస్తే కేంద్రం ఇజ్జత్ పోయేది. ఇంకా సిగ్గు లేకుండా జాతీయ హోదా అడుగుతున్నారు. ఎన్డీఎస్ఏ తాగి కూర్చున్న కమిటీ కాదు.. చట్టబద్ధంగా  ఏర్పడిన కమిటీ. క్యాబినెట్‌లో ఎప్పుడు పెట్టారు?. ఎప్పుడు సబ్ కమిటీ నివేదిక ఇచ్చింది?. ఎప్పుడు ప్రాజెక్ట్ ప్రారంభించారో రేవంత్ ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదు..?. కాళేశ్వరం లేకున్నా ఇవాళ పంట దిగుబడి ఎందుకు పెరిగిందో బీఆర్ఎస్ చెప్పాలి. రేవంత్ సర్కార్ వచ్చాక వారు విచారణ చేయరు.. సీబీఐకి అప్పగించరు’’ అంటూ బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement