బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన | BJP MLA Raja Singh Says Stand For Unity Of Work In Party | Sakshi
Sakshi News home page

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన

Jun 17 2025 6:55 PM | Updated on Jun 17 2025 7:16 PM

BJP MLA Raja Singh Says Stand For Unity Of Work In Party

హైదరాబాద్‌:  గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించిన ఆ పార్టీ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌.. తాజాగా సంచలన ప్రకటనతో మరొకసారి వార్తల్లోకి వచ్చారు.   ఇక ఐక్యంగా కలిసి పని చేద్దామంటూ రాజాసింగ్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం(జూన్‌ 17) రాజాసింగ్‌ ఓ స్టేట్‌మెంట్‌ రిలీజ్‌ చేశారు. 

‘పార్టీలో ఐక్యత, పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తున్నాను. కానీ నన్ను టార్గెట్‌ చేసి అడ్డంకులు సృష్టించాలని చూసినా నిస్వార్థంగా పార్టీ కోసమే పని చేశా. ఒక పార్టీ కార్యకర్తనైన నన్ను ఇబ్బంది పెడితే ఏం లాభం?. కిషన్‌రెడ్డి వ్యక్తిగత సమయం ఇస్తే వచ్చి కలుస్తాను. సమస్యలు, పార్టీలో మా స్పష్టతను వివరిస్తాను. సమయం నిర్ణయించే చెబితే వచ్చి కలిసేందుకు సిద్ధంగా ఉన్నా. విభజించడానికి కాదు.. ఐక్యత కోసం ఇక్కడ ఉన్నా. వ్యక్తిగత విభేధాలను విడిచిపెట్టి ఐక్యంగా పని చేద్దాం’ అని రాజాసింగ్‌ తన ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement