కేసీఆర్‌ది అహంకార, దుర్మార్గ పాలన | BJP Etela Rajender Comments on CM KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ది అహంకార, దుర్మార్గ పాలన

Oct 18 2023 2:47 AM | Updated on Oct 18 2023 2:47 AM

BJP Etela Rajender Comments on CM KCR - Sakshi

బీజేపీలో చేరిన నేరేడుచర్ల మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ శ్రీలతారెడ్డి

సాక్షి. హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ అహంకార, దుర్మార్గపు పాలనను అంతం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ అన్నారు. అలవి కాని హామీలతో కేసీఆర్‌ ప్రజలను మరోసారి బురి డీ కొట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, అయితే ఈ సారి బీఆర్‌ఎస్‌కి ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా లేరని చెప్పారు. తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్‌ ప్రజ లకిచ్చిన అనేక హామీలు అమలు కాలేదని ఆయన మండిపడ్డారు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్ట డానికి హుజూరాబాద్‌ ప్రజలకు అవకాశం వచ్చిందని, ఇప్పుడు గజ్వేల్‌ ప్రజలు కూడా సదవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారన్నారు. గజ్వేల్‌లో పేదల భూములు గుంజుకొని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు అప్పగిస్తున్న దుర్మార్గపు వ్యవస్థ నడుస్తోందని, మరోసారి అక్కడ గెలిస్తే 40, 50 ఏళ్లుగా పేదలు సాగుచేస్తున్న భూములను గుంజుకుని ప్రైవేట్‌ వారికి కట్టబెడతారన్నారు.

‘ఈటల రాజేందర్‌కు మద్దతు ఇస్తే తొక్కిపడేస్తా అని మంత్రి హరీశ్‌రావు అంటున్నారట.. తొక్కిపడేసే శక్తి నీకు లేదు. నిన్ను తొక్కిపడేసేది గజ్వేల్‌ ప్రజలు’ అని ఈటల హెచ్చరించారు. మంగళవారం ఆ పార్టీ కార్యాలయంలో సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ నియోజకవర్గం నేరేడుచర్ల మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షురాలు శ్రీలతారెడ్డి, విజయ్‌భాస్కర్‌రెడ్డి, ఓరుగంటి కిట్టు, నాగార్జునసాగర్‌ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ ముఖ్య నేత రంజిత్‌యాదవ్, చేర్యాల రెవెన్యూ డివిజన్‌ జేఏసీ చైర్మన్‌ చక్రధర్‌ తదితరులు బీజేపీలో చేరారు. ఈటల, ఇతర నేతలు వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

బీజేపీతోనే న్యాయం: శ్రీలతారెడ్డి
ఈ సందర్భంగా శ్రీలతారెడ్డి మాట్లాడుతూ ‘బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజల ఆకాంక్షలు, లక్ష్యాలు, ఆశయాలు నెరవేరలేదని, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. సంకినేని వెంకటేశ్వ రరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్‌ పార్టీలు చేసిన అభివృద్ధి ఏమిటో కూడా చెప్పుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement