కామారెడ్డిలో బీజేపీ సంచలన విజయం | Telangana Election Results 2023: BJP Candidate Venkata Ramana Reddy Win In Kamareddy Against KCR And Revanth Reddy - Sakshi
Sakshi News home page

Telangana Election Results 2023: కామారెడ్డిలో బీజేపీ సంచలన విజయం

Published Sun, Dec 3 2023 4:40 PM

BJP Candidate Venkata ramana Reddy Win In Kamareddy - Sakshi

సాక్షి, కామారెడ్డి: కామారెడ్డిలో బీజేపీ సంచలన విజయం సాధించింది. తెలంగాణ అసెం‍బ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డికి బిగ్‌ షాక్‌ తగిలింది. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి విజయం సాధించారు. ఈరోజు కౌంటింగ్‌ ముందు నుంచి గేర్లు మారుస్తూ కామారెడ్డిలో ప్రతీ రౌండ్‌కు ఆధిక్యం మారుతూ వచ్చింది. చివరకు బీజేపీ అభ్యర్థినే గెలుపు వరించింది. 

అయితే, కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్‌, కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి రేవంత్‌ రెడ్డి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే, కామారెడ్డి ఓటర్లు మాత్రం స్థానిక నేత అయిన వెంకట రమణ రెడ్డిపైనే నమ్మకం ఉంచి ఆయనను గెలిపించారు. ఇక, కౌంటింగ్‌లో చివరి నిమిషం వరకు కామారెడ్డి ఫలితం ఆసక్తికరంగా సాగాయి. ప్రతీ రౌండ్‌లోనూ ఆధిక్యం మారుతూ విజయం దోబూచులాడింది. ఒక సమయం‍లో కేసీఆర్‌, మరో సమయంలో రేవంత్‌ గెలుపు దిశగా ఫలితాలు వచ్చినా.. చిరవకు విజయం మాత్రం బీజేపీనే వరించింది. అయితే, వెంకట రమణా రెడ్డి గత ఎన్నికల్లో రెండు సార్లు పోటీ చేసి ఓటమి చెందారు. ఈసారి ఎన్నికల్లో మాత్రం విజయం సాధించారు. 

కామారెడ్డిలో ఇలా..
కామారెడ్డిలో 2009, 2014, 2018, 2012 ఉప ఎన్నికల్లో గంపా గోవర్దన్‌ గెలుపు. ఈ ఎన్నికల్లో సమీప అభ్యర్థి ప్రస్తుత షబ్బీర్‌ అలీపై గెలుపు. టీఆర్‌ఎస్‌ నుంచి బరిలో కేసీఆర్‌, రేవంత్‌ పోటీ. 2018లో టీఆర్‌ఎస్‌(బీఆర్‌ఎస్‌) పక్షాన గంపా గోవర్దన్‌, కాంగ్రెస్‌ తరపున సీనియర్‌ నేత, మాజీ మంత్రి, శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన షబ్బీర్‌ అలీ పోటీ పడగా, గోవర్దన్‌ నే విజయం వరించింది. గోవర్దన్‌ 4,557 ఓట్ల తేడాతో విజయం సాదించగలిగారు. గోవర్దన్‌ కు 68,162 ఓట్లు రాగా, షబ్బీర్‌ అలీకి 63,610 ఓట్లు వచ్చాయి. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement