ఇంటర్‌ విద్యార్థిని కాపాడిన సబ్‌ కలెక్టర్‌ | Sub collector Saves Intermediate Student | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యార్థిని కాపాడిన సబ్‌ కలెక్టర్‌

Mar 20 2026 12:30 AM | Updated on Mar 20 2026 12:30 AM

Sub collector Saves Intermediate Student

వాటర్‌ ట్యాంకు ఎక్కి సాహసం

నిజాంసాగర్‌(జుక్కల్‌): ‘రామ్మా శ్రావణి.. నేను సబ్‌ కలెక్టర్‌ను వచ్చాను.. కిందకు దిగమ్మా...నీకు నేను ఉన్నాను కిందకు రామ్మా’అంటూ వాటర్‌ ట్యాంకుపైకి ఎక్కి దాదాపు 9 గంటల పాటు గ్రామస్తులను ఆందోళనకు గురిచేసిన ఇంటర్‌ విద్యార్థిని బాన్సువాడ సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి కాపాడారు. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా మహమ్మద్‌ నగర్‌ మండలం బూర్గుల్‌ గ్రామానికి చెందిన మొట్ట శ్రావణి ఇందల్వాయి గురుకుల పాఠశాలలో ఇంటర్‌ చదువుతోంది. 

ఇటీవల ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు రాసిన శ్రావణి బూర్గుల్‌ వచ్చింది. అయితే గురువారం ఇంట్లో తల్లిదండ్రులు మందలించారన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటానంటూ ఇంటి పక్కనే ఉన్న వాటర్‌ ట్యాంకు ఎక్కింది. కుటుంబీకులు, గ్రామస్తులు ఎవ్వరు చెప్పినా శ్రావణి ట్యాంకు దిగకపోవడంతో సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అంబులెన్స్‌ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. 

విషయం తెలుసుకున్న బాన్సువాడ సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి ట్యాంకు వద్దకు చేరుకొని మైక్‌ సెట్‌ ద్వారా శ్రావణికి నచ్చజెప్పారు. ఎంతకీ యువతి కిందకు దిగకపోవడంతో సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి ఆ అమ్మాయితో మాట్లాడుకుంటూనే చిమ్మచీకట్లో సబ్‌ కలెక్టర్‌ ట్యాంక్‌ ఎక్కియువతి వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత ఎస్సై శివకుమార్, అగ్నిమాపక సిబ్బంది ట్యాంకు ఎక్కి యువతిని కిందకు దించారు. 

చదువులకు పేదరికం అడ్డుకావడంతో పా టు నాయక్‌పోడ్‌ కులధ్రువీకర ణ సర్టిఫికెట్లు రావడం లేదన్న కారణంతో ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని యువ తి సబ్‌ కలెక్టర్‌తో చెప్పినట్లు తెలిసింది.వాటర్‌ ట్యాంకు ఎక్కి విద్యార్థిని కిందికి తీసు కొచి్చన సబ్‌ కలెక్టర్‌ను గ్రామస్తులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement