టీడీపీకి చేదు అనుభవం.. షాక్‌ ఇచ్చిన స్థానికులు | Sakshi
Sakshi News home page

టీడీపీకి చేదు అనుభవం.. షాక్‌ ఇచ్చిన స్థానికులు

Published Fri, Feb 16 2024 8:30 PM

Bitter Experience For Tdp In Nizampatnam Repalle Constituency - Sakshi

బాపట్ల జిల్లా: రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నంలో టీడీపీకి చేదు అనుభవం ఎదురైంది. బాబు షూరిటీ భవిష్యత్‌ గ్యారెంటీ పేరిట టీడీపీ కార్యక్రమం చేస్తుండగా, తమ వీధికి రావొద్దంటూ టీడీపీ నాయకులను స్థానికులు అడ్డుకున్నారు. అబద్ధాలు చెప్పి మోసం చేసి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కంగుతిన్న టీడీపీ నాయకులు స్థానికులతో గొడవకు దిగారు.

టీడీపీలో టికెట్ల పంచాయతీ
పల్నాడు జిల్లా పెదకూరపాడు తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది. పెదకూరపాడు టికెట్‌ను కొమ్మలపాటి శ్రీధర్ కాకుండా మరొకరికి కేటాయిస్తున్నారంటూ ప్రచారం జరగడంతో కొమ్మలపాటి శ్రీధర్ వర్గీయులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. గుంటూరులో పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. కొమ్మలపాటికి టికెట్ కేటాయించాలంటూ తీర్మానించారు. వేరే వారికి టికెట్ కేటాయిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ చంద్రబాబు, లోకేష్‌లకు టీడీపీ నేతలు నాయకులు హెచ్చరికలు జారీ చేశారు.

ఇదీ చదవండి: Pawan Kalyan: సేనాని రూటే సెపరేటు!


 

Advertisement
 
Advertisement