కేటీఆర్‌ వ్యాఖ్యలకు బండి సంజయ్‌ కౌంటర్‌ | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ వ్యాఖ్యలకు బండి సంజయ్‌ కౌంటర్‌

Published Wed, Jan 24 2024 8:53 PM

Bandi Sanjay Counters Ktr Comments - Sakshi

సాక్షి, కరీంనగర్‌: కేసీఆరే సీఎం అనుకుంటూ కేటీఆర్‌ అహంకారంగా మాట్లాడుతున్నాడని బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. పదేళ్లు అబద్ధాలతో మోసం చేస్తూ కాలం గడిపారని దుయ్యబట్టారు.

పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌కు మూడోస్థానం. కేసీఆర్‌ ఎన్నిసార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారో కేటీఆర్‌ చెప్పాలి. యాదిగిరిగుట్టను వ్యాపార కేంద్రంగా మార్చిన ఘనత కేసీఆర్‌ది. కేసీఆర్‌ కొడుకుతోనే పార్టీ భ్రష్టుపట్టింది’’ అంటూ బండి  సంజయ్‌ నిప్పులు చెరిగారు.

పక్క జిల్లా నుంచి ఓ మేధావి ఇక్కడికొచ్చి మొరుగుతుంటడంటూ మాజీ ఎంపీ వినోద్‌పై మండిపడ్డారు. వినోద్ టిప్పర్ లోడు దరఖాస్తులు పంపడం తప్ప.. కరీంనగర్‌లో ఒక తట్టెడు మట్టి కూడా పోయలే అంటూ ఆయన ఎద్దేవా చేశారు. సిద్ధిపేట ఎల్కతుర్తి రోడ్డు పనులు ఎవరు చేయించారు? మేధావి వినోదా.. నేనా..?. శాతవాహన యూనివర్సిటీకి 12 బీ గుర్తింపు తెచ్చింది నేను కాదా..?’’  అని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

 
Advertisement
 
Advertisement