జూనియర్‌ ఎన్‌టీఆర్‌ స్పందిచకపోతే ఐ డోంట్‌కేర్‌: బాలయ్య | Bro, I Don't Care: Balakrishna On Jr NTR's Silence On Chandrababu Naidu Arrest - Sakshi
Sakshi News home page

జూనియర్‌ ఎన్‌టీఆర్‌పై బాలయ్య సంచలన వ్యాఖ్యలు

Oct 5 2023 12:28 AM | Updated on Oct 5 2023 9:05 AM

Bala Krishna sensational comments on Jr NTR - Sakshi

హైదరాబాద్‌: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీటీడీపీ కార్యకర్తలతో సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుపై సినీ రంగానికి సంబంధించిన పెద్దలెవరూ స్పందిచకపోవడంపై విలేఖరులు ప్రశ్నించగా ఎవరు స్పంధించకపోయినా తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. ఇది సినిమా రంగానికి సంబంధించిన విషయం కాదనడం కూడా తప్పే అన్నారు.

అయితే జూనియర్‌ ఎన్‌టీఆర్‌ స్పంధించకపోవడంపై విలేఖరులు ప్రశ్నించగా.. ఐ డోంట్‌ కేర్‌..  బ్రో.. ఐ డోంట్‌కేర్‌ అంటూ తీవ్రంగా స్పందించారు. ఇక ప్రస్తుతం జూనియర్‌ ఎన్‌టీఆర్‌ 'దేవర' సినిమా షూటింగ్‌ పనుల్లో బిజీగా ఉన్నట్టు సమాచారం. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు బాలకృష్ణ నటించిన 'భగవంత్‌ కేసరి' చిత్రం ఈ నెల 19న విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రానికి అనీల్‌ రావిపుడి దర్శకుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement