UP Assembly Elections 2022: If BJP Wins Free Gas Cylinder For Festivals, Details Inside - Sakshi
Sakshi News home page

UP Assembly Elections 2022: బీజేపీని గెలిపిస్తే ఆ పండుగలకు గ్యాస్‌ సిలిండర్‌ ఫ్రీ

Feb 19 2022 4:52 PM | Updated on Feb 19 2022 5:52 PM

UP Assembly Election 2022: BJP Promise Free Gas Cylinder For Festivals - Sakshi

యూపీలో అధికారాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.

ఉత్తరప్రదేశ్‌ను ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో యూపీపై వరాల జల్లు కురిపిస్తోంది. తాజాగా మూడో ఫేజ్‌ అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయిన్‌లో .. రక్షణ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత రాజ్‌నాథ్‌ సింగ్‌ పాల్గొన్నారు. బీజేపీకి ఓటేసి గెలిపిస్తే.. పండుగలకు గ్యాస్‌ సిలిండర్‌ ఫ్రీగా పంచుతామని ప్రకటించారు.

శనివారం గోండా కల్నల్‌గంజ్‌లో నిర్వహించిన పబ్లిక్‌ మీటింగ్‌లో రాజ్‌నాథ్‌ పాల్గొన్నారు. ఓటేసి బీజేపీని గనుక అధికారంలోకి తీసుకొస్తే.. ఏర్పాటు కాబోయే ప్రభుత్వం హోలీ, దీపావళి పండుగలకు ఓటర్లకు గ్యాస్‌ సిలిండర్‌లను ఉచితంగా పంపిణీ చేస్తుందని హామీ ప్రకటించారు. ఇదిలా ఉంటే యూపీ మూడో ఫేజ్‌ ఎన్నికలు రేపు(ఫిబ్రవరి 20, ఆదివారం) జరగనున్నాయి. 16 జిల్లాల్లో 59 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. 

ఇక తొలి రెండు ఫేజ్‌ ఫలితాల అంచనాపై స్పందించిన రాజ్‌నాథ్‌.. అంతర్గత సర్వేలు, పోల్‌ అనలిస్టులు కిందటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే రిపీట్‌ కావొచ్చని చెప్తున్నాయని తెలిపారు. సరిహద్దు అంశాలపై రాహుల్‌ గాంధీ చేసిన ‘చైనా-పాక్‌’ కామెంట్లు గురించి ప్రస్తావించిన రాజ్‌నాథ్‌ సింగ్‌..బహుశా రాహుల​ ఆధునిక భారత చరిత్ర చదవకుండానే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడేమో అని ఎద్దేవా చేశారు రాజ్‌నాథ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement