
AP Elections Political Latest Updates Telugu..
09:25 PM, Jan 30, 2024
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మళ్లీ నోటీసులు
- వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలకు మళ్లీ నోటీసులు
- నోటీసులు పంపిన స్పీకర్ కార్యాలయం
- ఫిబ్రవరి 8వ తేదీన స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని కోరిన స్పీకర్ తమ్మినేని సీతారాం
- ఫిబ్రవరి 5వ తేదీలోగా నోటీసులకు స్పందించాలని కోరిన స్పీకర్
- టీడీపీలోకి ఫిరాయించిన నలుగురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు
- ఎమ్మెల్యేలతో పాటు పిటిషనర్, ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద రాజుకు కూడా నోటీసులు జారీ
- ఈ ఐదుగురిని ఒకేసారి కలిపి విచారణ చేయనున్నారు స్పీకర్ తమ్మినేని
- మరోసారి ఎమ్మెల్యేల వివరణ తీసుకున్నాకే.. అనర్హత పిటిషన్ విషయంలో ఓ స్పష్టమైన నిర్ణయం ప్రకటించే అవకాశం
09:00 PM, Jan 30, 2024
వీరశివారెడ్డి రాజకీయం తెలిసిందే!
- మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పై కమలాపురం ఎమ్మెల్యే ఫైర్
- నోరు ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడడటం తగదు
- ఆయన రాజకీయ చరిత్ర అందరికి తెలిసిందే
- పేకాట, క్లబ్బులు,సారాయి దుకాణాలు, నడిపించిన ఘనత ఆయనది
- అదృష్టం బాగుండి ఎమ్మెల్యే అయ్యావు
- వైఎస్ కుటుంబ మద్దతుతోనే టీడీపీ లో ఉన్నా నువ్ ఎమ్మెల్యే అయ్యావు
- రెండవ సారి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే గా గెలిచావ్
- అధికారం ఎక్కడ ఉంటే వీరశివారెడ్డి ఆ పార్టీలో ఉంటాడు
- ఎమ్మెల్యే గా ఫైరవీలు, ఉద్యోగాల బదిలీలు, అక్రమ ఇసుక పేరుతో దండుకున్నారు
- ఇసుక దొంగ ఆయనే.. సారాయి దొంగ ఆయనే
- హైదరాబాద్, బెంగళూరులో వాహనాల దోంగతనాలకు పాల్పడిన చరిత్ర వీరశివారెడ్డి ది
- బెట్టింగ్ రాయుడు అనేది ఆయనకు ప్రత్యేక బిరుదు
- ఇంకొకరి గురించి వీరశివారెడ్డి మాట్లాడటం హేయమైన చర్య
- కేసులు మాఫీ అయ్యేందుకు 2019 ఎన్నికల తర్వాత వైసీపీకి మద్దతు ఇస్తున్న అన్నాడు
- వైఎస్ జగన్ వల్లే 2009 లో ఎమ్మెల్యే గా అవకాశం వచింది
- బెంగళూరులో అనేక సార్లు జగన్ ను కలిసిన విషయం వాస్తవం కాదా
- వైఎస్సార్సీపీని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను విమర్శలు చేయడం దారుణం
- నా పై చేసిన భూ కబ్జాలు చేసిన ఆరోపణలకు ఆయన కట్టుబడి ఉండాలి
- ఆ భూకబ్జా ఆరోపణల్ని వీరశివారెడ్డి నిరూపించాలి
- వేల ఎకరాలు దండుకున్న ఘనుడు చంద్రబాబు
- ప్రతి జిల్లాలో చంద్రబాబు కు ఆస్తులు ఉన్నాయి
- ప్రతి రాష్ట్రంలో చంద్రబాబు కు బినామీలు ఉన్నారు
- రానున్న ఎన్నికల్లో 175 కి 175 సీట్లు వైసీపీ కైవసం చేసుకుంటుంది
వైఎస్సార్ జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కామెంట్స్
08:45 PM, Jan 30, 2024
గుడివాడలో టీడీపీ తమ్ముళ్ల బలుపు మాటలు
- గుడివాడ పట్టణంలో తెలుగుదేశం నాయకుల ఓవర్ యాక్షన్
- సై అంటూ బ్యానర్ ఏర్పాటు చేసిన టీడీపీ నేతలు
- గుడివాడలో ఫ్లెక్సీల వార్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం
- సోషల్ మీడియా ప్రచారం నేపధ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు
- టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు అనుమతులున్నయో...లేదోనని మున్సిపల్ అధికారులను ఆరా తీసిన డిఎస్పీపి శ్రీకాంత్
- నెహ్రూ చౌక్ కు చేరుకుని హడావిడి చేసిన టీడీపీ నేతలు రావి వెంకటేశ్వరరావు,వెనిగండ్ల రాము
- డీఎస్పీపి శ్రీకాంత్ తో వాగ్వాదానికి టీడీపీ నేతలు రావి వెంకటేశ్వరరావు,వెనిగండ్ల రాము
- తమ బ్యానర్ల పై చేయి వేస్తే చేతులు నరికేస్తానంటూ డీఎస్పీ ఎదుటే వార్నింగ్ ఇచ్చిన రావి వెంకటేశ్వరరావు
07:52 PM, Jan 30, 2024
పీటీ వారెంట్‌పై విచారణ వాయిదా
- ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకి పీటీ వారెంట్పై ఏసీబీ కోర్టులో విచారణ
- ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ మీద బయట ఉన్న చంద్రబాబు
- చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టుని ఆశ్రయించిన సీఐడీ
- విచారణ సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంతో విచారణ వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
- వచ్చే నెల 22 కి వాయిదా
- స్కిల్ కేసులో పీటీ వారెంట్‌పై విచారణ మాత్రం బుధవారమే
07:33 PM, Jan 30, 2024
చంద్రబాబుకి వనిత ఓపెన్ ఛాలెంజ్
- గోపాలపురం నియోజవర్గం అనేది నా స్వస్థలం
- మా నాన్న బాబాజీ రావు ఇక్కడ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు
- ప్రజలకు నేను సుపరిచితురాలనే నేను పుట్టింటికి వచ్చినట్లుంది
- ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో దళారి వ్యవస్థ లేకుండా ప్రజలకు సంక్షేమాన్ని చేరువ చేశారు సీఎం జగన్
- వలంటరీ సచివాలయ వ్యవస్థ ద్వారా.. సంక్షేమం ఇంటికే చేరడంతో ప్రజలు సంతోషిస్తున్నారు
- జగనన్నకు ఓటు వేసేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారు
- ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. ఎంతమందితో కలిసి వచ్చినా భయపడేది లేదు
- ప్రజలు జగనన్నను ముఖ్యమంత్రిగా చేసేందుకు డిసైడ్ అయిపోయారు
- చంద్రబాబుది విజన్ అయితే.. 2019లో ఎందుకు అది పాయిజన్ అయిందో చెప్పాలి
- చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేదు
- అమ్మ ఒడి పథకాన్ని గతంలో ఎందుకు పెట్టలేదు
- రెండువేల పైచిలుకు వ్యాధులకు ఆరోగ్య శ్రీ లో చికిత్స ఎందుకు ఇవ్వలేదు
- చంద్రబాబు విజన్ అంటే దోచుకోవడం దాచుకోవడమేనా?
- నేను చంద్రబాబు కు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా..
- కొవ్వూరు నియోజకవర్గంలో ఏ ఇసుక ర్యాంపునుండైనా నాకు నెలకి గానీ సంవత్సరానికి గాని ఎవరైనా ఒక్క రూపాయి అయినా నాకు ఇచ్చారనీ నిరూపిస్తే రాజకీయాల నుండి నేను వైదొలుగుతా
హోం మంత్రి తానేటి వనిత వ్యాఖ్యలు
06:05 PM, Jan 30, 2024
ఆదిమూలం ఓ నమ్మక ద్రోహి
- సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆది మూలం నమ్మక ద్రోహి
- ఎమ్మెల్యే పదవి నుంచి తిరుపతి ఎంపీ పదవీకి ప్రమోట్ చేసినా నిలుపు కోలేదు
- టీడీపీ డైరెక్షన్లోనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి పై లేని పోని అభాండాలు వేశారు..
- టీడీపీ పార్టీ నమ్ముకుని బాగుపడింది ఎవరు లేరు.. ఆది మూలంకు త్వరలో తెలుస్తుంది
- సత్యవేడు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టించి, నాయకులతో సఖ్యత లేకుండా ఘర్షణ పడ్డారు
- నమ్ముకున్న పార్టీ నేతలకు న్యాయం చేయలేదు
- ఏ ముఖం పెట్టుకుని సత్యవేడు నియోజకవర్గంలో ఆది మూలం తిరుగుతారు
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని, కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకోం, తగిన బుద్ది చెబుతాం
- తిరుపతి ఎంపీ, సత్యవేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి వ్యాఖ్యలు
05:48 PM, Jan 30, 2024
కోతికి కొబ్బరిచిప్పలా.. కాంగ్రెస్‌కు షర్మిల
- ఏపీ ప్రతిపక్షాలపై మంత్రి అంబటి రాంబాబు ఫైర్.. సెటైర్లు
- ఆంబోతు రాంబాబు అంటూ చంద్రబాబు పేట్రేగిపోయారు
- నాకు ముక్కుతాడు వేయిస్తే ఆయనకు పచ్చబొట్టు వేయిస్తా
- ఆంబోతులకు ఆవులను సప్లై చేసిన చరిత్ర చంద్రబాబుది
- మళ్లీ అధికారంలోకి రాగానే ఇదే విషయాన్ని చంద్రబాబు చేతిమీద పచ్చబొట్టు వేయిస్తా
- మేము ఎన్నికలకు సిద్ధం
- 175 స్థానాల్లో పోటీకి సిద్దం
- పవన్ కల్యాణ్ దేనికి సిద్దమో చెప్పాలి
- చంద్రబాబు వేసే ముష్టికి సిద్దమా?
- ఓడిపోయి పారిపోవడానికి సిద్దమా?
- కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగా.. కాంగ్రెస్ పార్టీకి షర్మిల దొరికింది
- ఎన్నికల తర్వాత ఆమె కూడా తెలంగాణ పారిపోతుంది
05:18 PM, Jan 30, 2024
జగన్ భిక్ష తోనే ఎమ్మెల్యేనయ్యా: ఎమ్మెల్యే పద్మావతి
- శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆసక్తికర వ్యాఖ్యలు
- ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు శిరసా వహిస్తా
- శింగనమల కొత్త సమన్వయకర్తగా వీరాంజనేయులును సీఎం జగన్ ఎంపిక చేశారు
- వీరాంజనేయులుకు పూర్తి సహకారం అందిస్తాం
- నా సోదరుడిగా భావించి.. వీరాంజనేయులుకు పూర్తి సహకారం అందిస్తాం
- నేను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భిక్ష తోనే ఎమ్మెల్యే గా ఎన్నికయ్యాను
- సీఎం జగన్ నిర్ణయాన్ని శిరసా వహిస్తా
- వీరాంజనేయులు గెలుపునకు కృషి చేస్తా
05:10 PM, Jan 30, 2024
స్కిల్ కేసు విచారణ మరోసారి వాయిదా
- ఫిబ్రవరి 2 వ తేదీకి విచారణ వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
- చంద్రకాంత్ షా పిటిషన్ పై అభ్యతరాలు
- స్కిల్ స్కామ్ లో ఎ-2 ముద్దాయి మాజీ ఐఎఎస్ లక్ష్మీ నారాయణ ఏసీబీ కోర్టులో పిటిషన్
- లక్ష్మీనారాయణ పిటీషన్ పై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం
- విచారణ వాయిదా వేయాలని కోరిన చంద్రబాబు తరపు న్యాయవాదులు
- ఫిబ్రవరి 2 వ తేదీకి విచారణ వాయిదా వేసిన న్యాయమూర్తి
- అప్రూవర్ గా మారతానని ఏసీఐ ఎండీ చంద్రకాంత్ షా ఇప్పటికే ఎసిబి కోర్టులో పిటీషన్
- కౌంటర్ పేరుతో పలుమార్లు సమయం కోరిన చంద్రబాబు న్యాయవాదులు
- కేసులో కోర్టుకి సమర్పించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలని కోరిన చంద్రబాబు నాయుడు తరుపున న్యాయవాదులు
- దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని చంద్రబాబు తరుపున న్యాయవాదులకు ఆదేశించిన కోర్టు
- అప్పటి వరకు సిరీష్ చంద్రకాంత్ షా స్టేట్ మెంట్ రికార్డు వాయిదా వేసిన ఏసిబి కోర్టు
- చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదుల అభ్యంతరాలపై ఈ నెల 22 న ఏసిబి కోర్టులో విచారణ
- కౌంటర్ వేయడానికి సమయమివ్వాలన్న చంద్రబాబు న్యాయవాదులు
- నిన్నటి విచారణలో చంద్రకాంత్ షా పిటీషన్ ని వ్యతిరేకిస్తూ ఏ2 లక్ష్మీనారాయణ కౌంటర్ పిటిషన్
- అడ్డంగా దొరికిపోవడంతో చంద్రకాంత్ షా వాంగ్మూలం అడ్డుకునేందుకు చంద్రబాబు తరపు న్యాయవాదుల రకరకాలగా ఎత్తుగడలు
05:03 PM, Jan 30, 2024
పెద్దిరెడ్డి గురించి మాట్లాడే స్థాయి నీదా?
- సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నిజస్వరూపం బయట పడింది
- టీడీపీతో చేతులు కలిపి సొంత పార్టీ కు వెన్ను పోటు పొడిచింది ఆదిమూలమే
- మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి మాట్లాడేస్థాయి నీకు లేదు
- కోనేటి ఆదిమూలం కు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి గెలిపించింది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- కానీ, టీడీపీ నేతలతో రహస్య మంతనాలు ఈరోజు బహిర్గతం అయ్యాయి
ఆదిమూలంపై తిరుపతి జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ సిరాజ్ బాషా ఫైర్
05:00 PM, Jan 30, 2024
నారా లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల కేసు వాయిదా
- లోకేష్ తరపున హాజరైన న్యాయవాది లక్ష్మీనారాయణ
- కౌంటర్ దాఖలు చేయడానికి వారం రోజుల సమయం కోరిన లోకేష్ న్యాయవాది లక్ష్మీనారాయణ
- యువగళం ముగింపు రోజు మీడియా ఛానెళ్లతో వివాదాస్పద వ్యాఖ్యలు వేసిన లోకేష్
- చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించారని....రిమాండ్ విధించడం తప్పంటూ ఎసిబి న్యాయస్ధానానికి దురుద్దేశాలు ఆపాదించిన లోకేష్
- రెడ్ బుక్ పేరుతో అధికారులకి బెదిరింపులు
- వీడియోలతో సహా ఎసిబి కోర్టులో గత నెలలో పిటీషన్ వేసిన సిఐడి
- ఏసీబీ కోర్టు ఆదేశాలతో నోటీసులు పంపినా అందుకోని లోకేష్
- చివరగా ఏసీబీ కోర్టు నుంచే లోకేష్ కి నోటీసులు
- కోర్టు నోటీసులకి స్పందించి విచారణకి హాజరైన లోకేష్ న్యాయవాది
- నేటి విచారణలో మరోవారం సమయం అడిగిన లోకేష్ న్యాయవాది లక్ష్మీనారాయణ
- విచారణ ఫిబ్రవరి 6 వ తేదీకి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
03:56 PM, Jan 30, 2024
టీడీపీ నేత కొల్లు రవీంద్ర పై పేర్నినాని ఫైర్
- కొల్లు రవీంద్ర దిగజారి వ్యవహరిస్తున్నాడు
- నా పై బురదజల్లి ఎన్నికల్లో పబ్బంగుడుపుకోవాలని చూస్తున్నాడు
- రాజకీయాల్లో కొల్లురవీంద్ర వంటి దిగజారుడు మనిషిని ఇంకొకరిని చూడలేదు
- చాలా మంది టీడీపీ నేతలతో ప్రత్యర్ధులతో రాజకీయం నడిపాం
- గుమ్మటాల చెరువులో డబ్బులు తీసుకుని ఇళ్లు అమ్మిందెవరు...?
- పేదల దగ్గర వేల రూపాయలు వసూలు చేసిందెవరు..?
- సంపత్ అనే మున్సిపల్ కమీషనర్ ను బూతులు తిట్టి అవమానించి పంపిందెవరు...?
- పేర్నినాని ఎప్పుడూ తప్పుడు పనులు చేయడు..చేయలేదు
- రాజుపేట కరెంట్ సబ్ స్టేషన్ వెనుక పేదల పాకలు తొలగిస్తుంటే పోరాడిన వ్యక్తిని నేను
- పేదవాడికి అండగా ఉండే వ్యక్తి పేర్నినాని
- తప్పుడు పనులు చేసే వ్యక్తి కొల్లు రవీంద్ర
- మీరెన్ని కుయుక్తులు పన్నినా కుమ్మరిగూడెం ప్రజలకు నేను అండగా నిలబడతా
02:45 PM, Jan 30, 2024
ప్రతీ కుటుంబానికి సంక్షేమం
- విజయనగరం: గుర్లలో ఆసరా ఉత్సవాలను ప్రారంభించిన మంత్రి బొత్స సత్యనారాయణ
- పేదల ఆత్మగౌరవం నిలబెట్టడానికే సంక్షేమ పథకాలు
- ప్రభుత్వ సంక్షేమ పథకాలు రానివారు ఒక్కరైనా ఉన్నారా?
- పారదర్శకంగా పరిపాలనను అందిస్తున్నాం
- మేలు జరిగిన ప్రతి ఒక్కరూ సీఎం జగన్ కు అండగా నిలవాలి
02:39 PM, Jan 30, 2024
బాబుకి ఆ భయం పట్టుకుంది: YSRCP నేతలు
- చంద్రబాబు నాయుడు కి ఓటమి భయం పట్టుకుంది
- అది కళ్ళముందే కనబడుతుంది
- అందుకే మాపై పిచ్చిపిచ్చిగా విమర్శలు చేస్తున్నారు..
- స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో జైలు జీవితం అనుభవించిన చంద్రబాబు.. అవినీతి గురించి మాట్లాడడం హాస్యాస్పదం
- చంద్రబాబును రాష్ట్ర ప్రజలు మెడబెట్టి గెంటే రోజులు దగ్గరలోనే ఉన్నాయి..
- బీసీలకు వెన్నుపోటు పొడిచిన నీచ చరిత్ర చంద్రబాబు నాయుడుది.. ఆయనకి బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు..
- సీఎం వైఎస్ జగన్ తోనే SC, ST, బీసీ మైనార్టీలకు రాజకీయ గుర్తింపు లభించింది
- సాక్షి టీవీతో కావలి MLA ప్రతాప్ కుమార్ రెడ్ది, రాజ్యసభ సభ్యులు మస్తాన్ రావ్ కామెంట్స్..
02:18 PM, Jan 30, 2024
బాబు తెలంగాణకు వెళ్లాల్సిందే: ఎంపీ నాని
- టీడీపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కేశినేని నాని
- చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు
- మాలాంటి వ్యక్తులను దూరంగా చేసుకున్న వ్యక్తికి ఇవే చివరి ఎన్నికలు
- నారావారిపల్లెలో వాళ్ల తాతది తప్ప చంద్రబాబుకు సొంతిల్లు లేదు
- తన సొంత రాష్ట్రం తెలంగాణకు వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నాడు
- చంద్రబాబు అనేక ఊర కుక్కల్ని పెట్టుకుంటాడు..
- పార్టీ నుండి వెళ్ళే వారిని విమర్శించడమే వారి పని
- నన్ను చెప్పుతో కొడతా అంటూ మాట్లాడిన మాటలు ప్రజలందరికీ తెలుసు
- ఎవరిని ఎక్కువగా తిడితే ఆ ఊర కుక్కలకు, కాల్ మనీ కుక్కలకు పదవులు ఇస్తాడు
- ఆ ఊర కుక్కల గురించి నేను మాట్లాడను
- చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని 5వేల కోట్లతో ఎలక్షన్ ముందు చంద్రబాబు శంకుస్థాపన చేశారు
- అందులో కమిషన్లు బాగా మిగులుతాయని హడావిడిగా చేశారు
- ఏ.కొండూరు ప్రాంతంలో కిడ్నీ రోగుల గురించి చంద్రబాబు ఏ రోజు పట్టించుకోలేదు
- నారా లోకేష్ ఒక పనికి మాలినోడు
- ధనికులు పిల్లలతో చదువులో పోటీ పడేలా నాడు నేడు ద్వారా సీఎం జగన్ అభివృద్ధి కి చేశారు
- విజయవాడ పార్లమెంటరీ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, ఎంపీ కేశినేని నాని కామెంట్స్
01:30 PM, Jan 30, 2024
ఎంపీ కేశినేనినాని కుమార్తె శ్వేత రాజీనామా ఆమోదం
- ఇటీవల కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసిన కేశినేని శ్వేత
- రాజీనామాను ఆమోదించిన మేయర్ భాగ్యలక్ష్మి
01:28 PM, Jan 30, 2024
విజయవాడ: కొనసాగుతున్న కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ సమావేశం
- పల్లంరాజు అధ్యక్షతన 11 మంది సభ్యులతో మ్యానిఫెస్టో కమిటీ
- అన్ని పార్టీల కంటే ముందే మ్యానిఫెస్టో ప్రకటించాలని కాంగ్రెస్ యోచన
01:03 PM, Jan 30, 2024
సీఎంవోకు పలువురు ప్రజాప్రతినిధులు
- తమ నియోజకవర్గాల అభివృద్ధి పనులపై సీఎంవోకు వచ్చిన పలువురు ప్రజాప్రతినిధులు
- సీఎంవోకు వచ్చిన వారిలో మంత్రులు ఉషశ్రీ చరణ్, గుడివాడ అమర్నాథ్‌లతో పాటు కురసాల కన్నబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బుర్రా మధుసూదన్ యాదవ్, ధనలక్ష్మీ, అనంతబాబులు
- అభివృద్ధి పనులపై అధికారులతో ప్రజాప్రతినిధులు భేటీ
12:47 PM, Jan 30 2024
ఉత్తరాంధ్రలో సిద్దం సభకు ఊహించని రెస్పాన్స్: వైవీ సుబ్బారెడ్డి
- రానున్న రోజుల్లో మరో మూడు సభలను నిర్వహిస్తాం
- ఏలూరు, అనంతపురంతో పాటు నెల్లూరు లేదా ఒంగోలులో ఇంకో సభ ఉంటుంది
- సీఎం జగన్ కార్యకర్తలను స్వయంగా కలిసి ఎన్నికలకు సిద్దం చేస్తున్నారు
- అభివృద్ధి, సంక్షేమం అనేది సీఎం జగన్‌కి రెండు కళ్లు లాంటివి
- గడిచిన ఐదేళ్లలో మా ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారు
- చంద్రబాబు విజన్ కేవలం తన వారిని అభివృద్ధి చేసుకోవటమే
- అమరావతి అభివృద్ధి తప్ప రాష్ట్ర ప్రజలతో సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించారు
- కచ్చితంగా మూడు రాజ్యసభ సీట్లను కైవసం చేసుకుంటాం
- చంద్రబాబు చేసే కుట్రలు ఫలించవు
- మా ఎమ్మెల్యేలంతా మావైపే ఉన్నారు
12:36 PM, Jan 30 2024
డోన్.. టీడీపీ వికెట్ డౌన్
- తెలుగుదేశం పార్టీలో మూడు ముక్కలాట..
- కేఈ, కోట్ల, బీసీ వర్గాలుగా విడిపోయిన నేతలు
- ధర్మవరం సుబ్బారెడ్డికి మద్దతుగా బీసీ జనార్దన్‌రెడ్డి
- జనార్దన్‌రెడ్డి పెత్తనంపై రగిలిపోతున్న కేఈ, కోట్ల వర్గాలు
- సుబ్బారెడ్డికి టికెట్ ఇస్తే సహకరించేది లేదంటూ అధినేతకు అల్టిమేటం
- కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిని బరిలో దింపే అవకాశం
11:14 AM, Jan 30 2024
ప్రత్యేక హోదాను తుంగలోకి తొక్కింది చంద్రబాబే: ఎంపీ మార్గాని భరత్
- రైతులను నమ్మించి అధికార పీఠంపై కూర్చుని రైతులను నట్టేట ముంచిన నాయకుడు చంద్రబాబు
- ప్రత్యేక హోదాను తుంగలోకి తొక్కింది చంద్రబాబే
- పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసింది చంద్రబాబే
- పోలవరం విషయంలో మీ పార్టీలో ఎవరితోనైనా సరే నేను డిబేట్ కు సిద్ధం
- చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును నాశనం చేసి ఆంధ్రప్రదేశ్ ద్రోహిగా మిగిలాడు
- చంద్రబాబు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు వల్ల ఈ సి ఆర్ ఎఫ్ లో భారీ స్కవర్స్ పడిపోయాయి..
- పోలవరంలో చంద్రబాబు చేసిందల్లా జనాన్ని తీసుకువెళ్ళి భజన చేయించుకున్నాడు
- రాజమండ్రిని ఎంత అభివృద్ధి చేశారో.. మీరు సెంట్రల్ జైలు కిటికీలు నుంచి చూసే ఉంటారు
- రాజమండ్రిలో మేం వేసిన రోడ్లు హైదరాబాదులో కూడా లేవు .....అక్కడ ఉన్నట్టు మీరు చూపిస్తే మీకు క్షమాపణ చెప్తాను
- మీ హయాంలో జన్మభూమి కమిటీలు పందికొక్కుల్లా దోచుకుతిన్నాయి
- హైదరాబాదులో లుంబిని పార్కును తలదన్నే రీతిలో కంబాలచెరువు పార్కును తయారు చేసాము
- చంద్రబాబుకు వయసు అయిపోయింది.. అప్ గ్రేడ్ కాలేదు
- చంద్రబాబుకు వయసు అయిపోయింది ...ముసలివారికి కూడా కనెక్ట్ కావడం లేదు
- 14 ఏళ్లలో రాష్ట్రానికి చంద్రబాబు చేసింది ఏమీ లేదు
- తెలుగుదేశం పార్టీ హయాంలో రాజమండ్రి పెద్దపల్లెటూరులా ఉండేది
- నేను పార్లమెంట్లో మాట్లాడిన అంశాల్లో 50% మీ ఎంపీలు ఎవరైనా మాట్లాడితే నేను రాజీనామా చేస్తాను
- రాజమండ్రిలో లోకేష్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టి నాపై గెలవమని చెప్పండి ....ఛాలెంజ్ చేస్తున్నాను
- నేను చేసిన అభివృద్ధి లో మీ కొడుకు 50% అయినా చేయగలడా?
- లోకేష్ కంటే జూనియర్ ఎన్టీఆర్ చాలా బెటర్ ...అతని తీసుకురండి మీ పార్టీ బతుకుతుంది
- రాజమండ్రిలో కూడా కొందరు అధికారాన్ని అడ్డుపెట్టుకుని చిట్లు వ్యాపారం చేస్తున్నారు... వడ్డీ వ్యాపారం చేసుకునే వాళ్లకు రాజకీయాలు దేనికి.
- విద్య వైద్య రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో జగనన్న చేసిన డెవలప్‌మెంట్ దేశంలో ఎక్కడా జరగలేదు ఈ విషయంలో ఎవరితోనైనా డిబేట్‌కి సిద్ధం.
11:00AM, Jan 30 2024
చంద్రబాబుకు టీడీపీ నేత ఆలపాటి షాక్
- సీఎం జగన్‌ను ప్రశంసించిన టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్
- నిన్న(సోమవారం)గుంటూరు జిల్లా చేబ్రోలులోని వడ్లమూడిలో ‘రా కదలిరా’ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆలపాటి పొగడ్తలు
- ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు సీఎం జగనే అన్న ఆలపాటి
- ఉన్న వాస్తవం ఆలపాటి నోటి నుంచి రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ చంద్రబాబు, అవాక్కైన నేతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఏకైక నాయకుడు సీఎం వైయస్ జగన్.
— YSR Congress Party (@YSRCParty) January 29, 2024
-టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా
ఎట్టకేలకు నిజం ఒప్పుకుంటున్న @JaiTDP నాయకులు. ఇక చంద్రబాబు కూడా నిజం ఒప్పుకోవాలి, నిజాన్ని గెలిపించాలి! 😄#YSJaganDevelopsAP#EndOfTDP pic.twitter.com/vTAe6U2G9m
10:59 AM, Jan 30 2024
ఏపీని మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు: వెల్లంపల్లి శ్రీనివాస్
- ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి నమ్మకద్రోహం చేసింది చంద్రబాబే
- నందమూరి కుటుంబాన్ని నాశనం చేసిన నీచుడు చంద్రబాబు
- చంద్రబాబుకి ప్రజల నుంచి ఆదరణ లేదు
- చంద్రబాబుకి 75 ఏళ్లు రావడంతో మతిభ్రమించి సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నాడు
- చంద్రబాబు, పవన్ పనికిమాలిన లోకేష్కు సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత లేదు
- రాష్ట్ర సంక్షేమాన్ని గాలికి వదిలేసింది చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లు
- చంద్రబాబు బెదిరిస్తే భయపడే వాళ్లు ఎవరూ లేరు
- 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏం పీకాడు
- సోనియా గాంధీని ఎదిరించిన మొనగాడు సీఎం జగన్
10:49 AM, Jan 30 2024
చంద్రబాబు దళిత వ్యతిరేకి: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
- చంద్రబాబు ఎస్సీ నియోజకవర్గాల్లో ఎన్ని సార్లు టీడీపీ అభ్యర్థులను మార్చలేదు
- సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాలాంటి వాళ్లకు ఉన్నత పదవులను ఇచ్చారు
- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి
- కుప్పం వదిలిరా.. పలమనేరు, తాడిపత్రి, రాప్తాడు సీట్లు మార్చే దమ్ము నీకు ఉందా?.. చంద్రబాబుకు సవాల్
- చంద్రబాబు ఆర్థికంగా బలంగా ఉన్న దళిత నాయకుల్ని బలిపశువును చేస్తున్నారు
- సీఎం జగన్ ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చి ప్రజలు జీవితాల్లో మార్పులు తీసుకు వస్తున్నారు
- చంద్రబాబు కొడుకు లోకేష్ ఎక్కడ చదివాడు, విదేశాల్లో చదువుకోలేదా?
- నవరత్నాల పేరుతో సీఎం జగన్ పేదల జీవితాల్లో వెలుగులు నిపారు
10:18AM, Jan 30 2024
కొండ ప్రాంతంలో అభివృద్ధి చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదే
- విజయవాడ సున్నపుబట్టీల సెంటర్ లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో దేవినేని అవినాష్
- టిడ్కో ఇళ్ల పేరుతో టీడీపీ నేతలు ప్రజలను దోచుకున్నారు
- ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు విలువలు దిగజారస్తూ నీచపురాతలు రాస్తున్నాయి
- చంద్రబాబు చేసిన అభివృద్ధి చెప్పుకోలేక జగన్‌పై విష ప్రచారం చేస్తున్నారు
- చంద్రబాబు నీచ రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు
- రానున్న ఎన్నికలలో చంద్రబాబు అనుచరగణాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
9:01AM, Jan 30 2024
వైఎస్సార్‌సీపీ బహిష్కృత ఎమ్మెల్యేల అనర్హతపై ఉత్కంఠ
- నేడు స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకునే అవకాశం
- 8 మంది ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్‌పై నిన్న స్పీకర్ విచారణ
- నిన్న(సోమవారం)స్పీకర్ ఎదుట వ్యక్తిగత విచారణకు హాజరైన ఐదుగురు ఎమ్మెల్యేలు
- ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలన్న స్పీకర్
8:56 AM, Jan 30 2024
టీడీపీ ముఠా ఎన్నికల దందాపై కేసు నమోదు
- పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సహా పలువురిపై కేసు నమోదు
- మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు అనుమతితో ఎఫ్‌ఐఆర్
- నిందితుల్లో ఏ1గా ఏలూరి, నోవా అగ్రిటెక్ కంపెనీ ఉద్యోగులు
- సొంత కంపెనీ మాటున టీడీపీ ఎమ్మెల్యే అక్రమాలు
- దొంగఓట్లు, ఇతర అక్రమాలతో గెలిచారనే ఆరోపణలు.. ఏలూరిపై కేసును స్వాగతిస్తున్న ప్రజాస్వామిక వాదులు
8:00 AM, Jan 30 2024
వైఎస్సార్‌సీపీకి మరింత పెరిగిన ప్రజాదరణ
- సీఎం జగన్ భీమిలి సభతో వైఎస్సార్‌సీపీకి మరింత పెరిగిన ఆదరణ
- చంద్రబాబు 15 సభలు ఒక ఎత్తు.. సీఎం జగన్ భీమిలి సభ ఒక్కటీ మరో ఎత్తు
- సంక్షేమ సారథిపై వెల్లువెత్తుతున్న ఆదరణ.. ఎన్నిక ఏదైనా ఏకపక్షమే
- గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో 151 అసెంబ్లీ, 22 ఎంపీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం
- దేశ చరిత్రలో అత్యంత భారీ విజయం సాధించిన పార్టీగా రికార్డు
- మేనిఫెస్టో హామీల్లో 99.5 శాతంఅమలు చేసి నిబద్ధత చాటుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
- అర్హతే ప్రామాణికంగా పారదర్శకంగా సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలు
- డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో పేదలకు రూ.4.21 లక్షల కోట్ల మేర ప్రయోజనం
- పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ఇంటి గుమ్మం వద్దకే సేవలన్నీ
- కేబినెట్ నుంచి నామినేటెడ్ వరకూ సామాజిక న్యాయానికి పెద్దపీట
- విప్లవాత్మక సంస్కరణలతో ప్రగతిపథంలో అగ్రభాగాన ఆంధ్రప్రదేశ్
- నాలుగున్నరేళ్లుగా సుపరిపాలనతో ప్రతి గ్రామం, ప్రతి ఇంట్లో మార్పు
- పంచాయతీ, మండల, జెడ్పీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ చారిత్రక విజయాలు
- తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వరుస విజయాలు
- 25కు 25 లోక్‌సభ స్థానాల్లోనూ ‘ఫ్యాన్’ సత్తా చాటడం తథ్యమన్న ‘టైమ్స్ నౌ’ సర్వే
- 2019కి మించి వైఎస్సార్‌సీపీ భారీ విజయం సాధించడం ఖాయమంటున్న విశ్లేషకులు
7:30 AM, Jan 30 2024
చంద్రబాబుకు మతిభ్రమించింది: ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
- చంద్రబాబు మతిభ్రమించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు
- రాజమహేంద్రవరం రాగానే అక్కడ జైలు జీవితం గుర్తుకు వచ్చినట్లుండి
- ఆయనకు ఇతరులపై బురద జల్లడమే పని
- అది మాని పార్టీలోని అంతర్గత సమస్యలు చక్కదిద్దుకుంటే మేలు
- ఉన్నవి, లేనివి కల్పించి వైఎస్సార్‌సీపీ, నేతలపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చే పనిలో పడ్డారు
- చంద్రబాబుకు ఏ విషయంలోనూ చిత్తశుద్ధి లేదు
7:27 AM, Jan 30 2024
చంద్రబాబు సభలు అట్టర్‌ఫ్లాప్
- జనం కరువు.. ఖాళీ కుర్చీలకు ఏకరువు
- రాజమహేంద్రవరం రూరల్, పొన్నూరుల్లో ‘రా కదలి రా’ విఫలం
- బాబు ప్రసంగిస్తుండగానే జారుకున్న జనం
- రాజానగరం టీడీపీ ఇన్‌చార్జి బొడ్డు వర్గం నిరసన సెగ
- తోపులాటలో కింద పడబోయిన బాబు
- రక్షించిన భద్రతా సిబ్బంది
చంద్రబాబు సభలకు జనం రాకపోవడంతో టీడీపీ నేతల్లో గుబులు@ncbn ప్రసంగంలో పసలేకపోవడంతో మధ్యలోనే వెళ్లిపోతున్న జనం
— YSR Congress Party (@YSRCParty) January 29, 2024
రోజురోజుకీ @JaiTDP కేడర్‌లో పెరుగుతున్న నైరాశ్యం#CorruptBabuNaidu#EndOfTDP pic.twitter.com/wQdJ6O63nc
7:15 AM, Jan 30 2024
రాజ్యసభకు మోగిన నగారా
- ఫిబ్రవరి 8న నోటిఫికేషన్
- నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఫిబ్రవరి 15
- నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఫిబ్రవరి 20
- ఫిబ్రవరి 27న పోలింగ్.. అదేరోజు ఓట్ల లెక్కింపు
- అసెంబ్లీలో సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే ఈ మూడూ వైఎస్సార్‌సీపీకే
- దీంతో రాష్ట్ర కోటాలోని 11 స్థానాలు వైఎస్సార్‌సీపీ పరం
- రాజ్యసభలో ఉనికేలేకుండా పోనున్న టీడీపీ
- 41 ఏళ్ల ఆ పార్టీ చరిత్రలో రాజ్యసభలో టీడీపీకి సభ్యత్వం లేకుండా పోవడం ఇదే ప్రథమం
- ఏప్రిల్ 2తో వేమిరెడ్డి, కనకమేడల, సీఎం రమేష్‌ల పదవీకాలం పూర్తి
7:10 AM, Jan 30 2024
అడ్డంగా దొరికి.. అప్రూవర్ వాంగ్మూలం అడ్డుకునేందుకు కుట్రలు
- ఏసీబీ కోర్టులో స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసు అప్ డేట్
- అప్రూవర్ గా మారిన ఏసీఐ ఎండీ చంద్రకాంత్ షా స్టేట్ మెంట్ ని అడ్డుకునేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు
- చంద్రకాంత్ షా పిటీషన్ పై అభ్యతరం వ్యక్తం చేస్తూ స్కిల్ స్కామ్ లో ఎ-2 ముద్దాయి మాజీ లక్ష్మీ నారాయణ ఎసిబి కోర్టులో పిటీషన్
- లక్ష్మీనారాయణ పిటీషన్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ
- అప్రూవర్ గా మారతానని ఏసిఐ ఎండి చంద్రకాంత్ షా ఇప్పటికే ఏసీబీ కోర్టులో పిటిషన్
- కౌంటర్ పేరుతో పలుమార్లు సమయం కోరిన చంద్రబాబు న్యాయవాదులు
- కేసులో కోర్టుకి సమర్పించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలని కోరిన చంద్రబాబు నాయుడు తరుపున న్యాయవాదులు
- దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని చంద్రబాబు తరుపున న్యాయవాదులకు ఆదేశించిన కోర్టు
- అప్పటి వరకు సిరీష్ చంద్రకాంత్ షా స్టేట్ మెంట్ రికార్డు వాయిదా వేసిన ఏసిబి కోర్టు
- చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదుల అభ్యంతరాలపై ఈ నెల 22 న ఏసిబి కోర్టులో విచారణ
- కౌంటర్ వేయడానికి సమయమివ్వాలన్న చంద్రబాబు న్యాయవాదులు
- నేటి విచారణలో చంద్రకాంత్ షా పిటీషన్ ని వ్యతిరేకిస్తూ ఏ2 లక్ష్మీనారాయణ కౌంటర్ పిటీషన్
- అడ్డంగా దొరికిపోవడంతో చంద్రకాంత్ షా వాంగ్మూలం అడ్డుకునేందుకు చంద్రబాబు తరపు న్యాయవాదుల కుట్రలు
7:07 AM, Jan 30 2024
ఏపీ ఎన్నికల్లో కమలం ఒంటరిపోరు
- ఏపీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్న బీజేపీ
- ఇప్పటికే క్లస్టర్‌లుగా విభజించి వరుస సమావేశాలతో దిశానిర్దేశం
- రెండు రోజులుగా కొనసాగుతున్న సమావేశాలు
- మరోవైపు.. క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగిన కొందరు నేతలు
- ఓడిపోయే టీడీపీతో పొత్తేంటన్న భావనలో మెజార్టీ నేతలు
- ఇదే విషయాన్ని అధిష్టానానికి నివేదించిన సీనియర్లు
- టీడీపీతో బీజేపీ చెయ్యి కలిపించేందుకు పవన్ యత్నం
- టీడీపీతో వెళ్తేనే బాగుంటుందని మొదటి నుంచి పురందేశ్వరి అధిష్టానానికి నివేదికలు
- పలు సర్వేల ఆధారంగా ఓ నిర్ణయానికి వచ్చిన బీజేపీ అధిష్టానం
- ఓడిపోయే పార్టీతో జట్టు వద్దని కంక్లూజన్
- మరిది చంద్రబాబుతో పొత్తు చేస్తున్న పురందేశ్వరి ప్రయత్నాలకు చెక్
- పవన్‌నూ పక్కన పడేయాలని నిర్ణయం
7:00 AM, Jan 30 2024
వైఎస్సార్‌సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలకు చుక్కెదురు
- శాసనసభ సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ అసెంబ్లీ స్పీకర్ నోటీసులు
- స్పీకర్ నోటీసులను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు
- వివరణ ఇచ్చేందుకు గడువు కావాలని కోరుతున్న వైఎస్సార్‌సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు
- ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలతో పాటు ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య పిటిషన్
- వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం
- మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ
- ఈ దశలో జోక్యం చేసుకోలేమన్న ఏపీ హైకోర్టు
- కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు ఆదేశం
- తదుపరి విచారణ ఫిబ్రవరి 26 కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు
6:30 AM, Jan 30 2024
రెడ్‌బుక్ బెదిరింపులపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ
- నారా లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల కేసుపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ
- యువగళం ముగింపు రోజు మీడియా ఛానెళ్లతో వివాదాస్పద వ్యాఖ్యలు వేసిన లోకేష్
- చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించారని.. రిమాండ్ విధించడం తప్పంటూ ఎసిబి న్యాయస్ధానానికి దురుద్దేశాలు ఆపాదించిన లోకేష్
- రెడ్ బుక్ పేరుతో అధికారులకి బెదిరింపులు
- వీడియోలతో సహా ఎసిబి కోర్టులో గత నెలలో పిటీషన్ వేసిన సీఐడీ
- ఏసీబీ కోర్టు ఆదేశాలతో నోటీసులు పంపినా అందుకోని లోకేష్
- చివరగా ఏసీబీ కోర్టు నుంచే లోకేష్ కి నోటీసులు
- స్వయంగా హాజరై లేదా న్యాయవాది ద్వారా విచారణకి రావాలని గత వారం ఆదేశం
- ఈ నెల 22 న జరిగిన విచారణలో రెండు వారాల సమయం కోరిన లోకేష్ న్యాయవాదులు
- ఒక వారమే సమయమిచ్చిన న్యాయస్ధానం
- నేడు జరగనున్న విచారణ